Rishabh Pant Returns As India A captain: కెప్టెన్‌గా రిషభ్ పంత్
ABN , Publish Date - Oct 21 , 2025 | 05:14 PM
టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు ప్రమోషన్ దక్కింది. ఇతడు ఇంగ్లండ్ పర్యటనలో తీవ్రంగా గాయపడి భారత జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాలి గాయం నుంచి కోలుకుంటున్న పంత్.. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
క్రికెట్ న్యూస్: టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు ప్రమోషన్ దక్కింది. ఇతడు ఇంగ్లండ్ పర్యటనలో తీవ్రంగా గాయపడి భారత జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాలి గాయం నుంచి కోలుకుంటున్న పంత్.. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ కు కెప్టెన్ గా అవకాశం దక్కింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
స్వదేశంలో భారత్ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్(India vs South Africa A) ఆడనుంది. అయితే ఈ సిరీస్ కంటే ముందు భారత్-ఏ , సౌతాఫ్రికా-ఏ జట్ల మధ్య రెండు అనధికార టెస్ట్‌లతో పాటు మూడు అనధికార వన్డేలు జరగనున్నాయి. అక్టోబర్ 30, నవంబర్ 6 నుంచి సౌతాఫ్రికాతో రెండు అనధికార టెస్ట్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్ లకు భారత్-ఏ కెప్టెన్ గా రిషబ్ పంత్(Rishabh Pant Captaincy) ఆడనున్నాడు. ఈ అనధికార టెస్ట్, వన్డేలు ఆడే భారత్-ఏ జట్లను అజిత్ అగార్కర్(Ajit Agarka) సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.
ఇంగ్లాండ్ టూర్‌లో నాలుగో టెస్ట్ సందర్భంగా రిషభ్ పంత్ కాలికి తీవ్ర గాయమైంది. అయినా నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ కొనసాగించిన పంత్.. ఆఖరి టెస్ట్ ఆడకుండానే స్వదేశానికి తిరిగి వచ్చాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున రీఎంట్రీ ఇస్తారని అంతా భావించిన..అది జరగలేదు. భారత అండర్ 19 కెప్టెన్ ఆయుష్ మాత్రేతో పాటు నారాయణ జగదీశన్, రంజిత్ పటీదార్, అన్షుల్ కంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, శరణ్ జైన్ ఈ తొలి అనధికార టెస్టుకు(Indian Cricket Team) ఎంపికయ్యారు. కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్, గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్ రెండో అనధికార టెస్టులో ఆడనున్నారు. రిషభ్ పంత్‌తో పాటు సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, మానవ్ సుతార్, తనూష్ కొటియాన్ ఈ రెండు మ్యాచ్‌ల్లో(India A Squad) ఆడనున్నారు.
ఇవి కూడా చదవండి..
Mohammad kaif Slams Shubman Gill: గిల్ కెప్టెన్సీ బాలేదు..టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్
Chamari Athapaththu: 4 బంతుల్లో 4 వికెట్లు.. సెమీస్ ఆశలు ఆవిరి!