Mohammad kaif Slams Shubman Gill: గిల్ కెప్టెన్సీ బాలేదు..టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్
ABN , Publish Date - Oct 21 , 2025 | 02:31 PM
టీమిండియా కెప్టెన్ గా ఉన్న శుభ్‌మన్ గిల్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గిల్ పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ విమర్శలు గుప్పించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గిల్ కెప్టెన్సీ బాలేదన్నాడు.
క్రికెట్ న్యూస్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 136 స్వల్ప పరుగులు చేసింది. ఈ స్కోర్‌ను ఆసీస్ సునాయాసంగా ఛేదించింది. దీంతో టీమిండియా కెప్టెన్ గా ఉన్న శుభ్‌మన్ గిల్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గిల్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ విమర్శలు గుప్పించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతని కెప్టెన్సీ బాలేదని, తీవ్రంగా నిరాశపర్చిందని అన్నాడు.
తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా పెర్త్ లో జరిగిన వన్డే మ్యాచ్ గురించి మహమ్మద్ కైఫ్(Mohammad kaif)మాట్లాడాడు. పార్ట్‌టైమ్ బౌలర్లతో విజయాలు సాధించలేమని, వికెట్ టేకింగ్ బౌలర్ అయిన కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)ను తుది జట్టులో ఆడించాలని సూచించాడు. ఆస్ట్రేలియా పర్యటన భారత బౌలర్లతో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సామర్థ్యానికి కూడా పరీక్షలేనని కైఫ్ అన్నాడు. తుది జట్టులో కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పించలేదని, వికెట్ టేకింగ్ బౌలర్‌ను జట్టులోకి తీసుకోలేదని తెలిపాడు. కుల్దీప్ యాదవ్‌ను ఆడించకపోవడం నిరాశకు గురి చేసిందని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ కూడా రెండు వికెట్లు తీశాడని గుర్తు చేశాడు.
ఇంకా కైఫ్ మాట్లాడుతూ..'ప్రస్తుతం జట్టులో చాలా మంది పార్ట్ టైమ్ బౌలర్లు ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి(Nitesh kumar Reddy) పూర్తి స్థాయి బౌలర్ కాదు. పెర్త్ పిచ్ పై వాషింగ్టన్ సుందర్ కూడా పూర్తి స్థాయి బౌలర్ కాదు. ఫుల్ టైమ్ బౌలర్‌గా హర్షిత్ రాణా నిరాశపర్చాడు. స్వల్ప లక్ష్యమే అయినా మ్యాచ్‌ను గెలిపించే బాధ్యతను బౌలర్లు తీసుకోవాలి. కేవలం బుమ్రా, షమీ ఉన్నప్పుడే గెలుస్తామంటే ఎలా?' కైఫ్ ప్రశ్నించాడు. ఆసీస్(Australia) స్పిన్నర్ షేన్ వార్న్ మూడు ఫార్మాట్లలో సత్తా చాటాడనే విషయాన్ని కైఫ్ గుర్తు చేశాడు. ఆసీస్ వికెట్లు స్పిన్‌కు అనుకూలంగా ఉండవని చెప్పడం సరికాదన్నాదని కైఫ్ అన్నాడు.
ఇవి కూడా చదవండి..
డీల్ ఆర్ నో డీల్.. చైనా ఒప్పుకోకపోతే 155 శాతం సుంకాలు.. ట్రంప్ బెదిరింపు..
స్వల్పంగా తగ్గింది.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..