Rinku Singh: ప్రేమ ప్రయాణం అలా మొదలైంది
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:57 AM
టీమిండియా క్రికెటర్ రింకూసింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన లోక్‌సభ సభ్యురాలు ప్రియా సరోజ్‌ల ఎంగేజ్‌మెంట్ జూన్ 8న లఖ్‌నవూలో ధూంధాంగా జరిగింది. అయితే వీరిద్దరి పరిచయం ఎలా ఏర్పడిందనే విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు....
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ రింకూసింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన లోక్‌సభ సభ్యురాలు ప్రియా సరోజ్‌ల ఎంగేజ్‌మెంట్ జూన్ 8న లఖ్‌నవూలో ధూంధాంగా జరిగింది. అయితే వీరిద్దరి పరిచయం ఎలా ఏర్పడిందనే విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. కానీ ఆ సస్పెన్స్‌కు రింకూనే స్వయంగా తెరదించాడు. ‘కొవిడ్ సమయంలో 2022 ఐపీఎల్ ముంబైలో జరిగిన సందర్భంగా ప్రియతో పరిచయం ఏర్పడింది. నాకో ఫ్యాన్ పేజీ ఉండేది. తన గ్రామంలో ఓటింగ్‌కు సంబంధించిన ఓ ఫొటోను ప్రియ అందులో పోస్ట్ చేసింది. ఆ ఫొటో చూడగానే..నాకు ఆమె పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందని భావించా. దాంతో ఆమెకు మెసేజ్ చేయాలని అనుకున్నా. కానీ బాగుండదని ఆ ఆలోచన విరమించుకున్నా. అయితే తర్వాత ఇన్‌స్టాలో నా ఫొటోలను చూసి ఆమె ఇష్టపడింది. దాంతో నేను ఆమెకు మెసేజ్ చేశా. క్రమంగా మాటలు మొదలయ్యాయి. అలా మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది’ అని రింకూ వివరించాడు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి