RCB Increases Compensation: తొక్కిసలాట మృతులకు రూ 25 లక్షలు
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:37 AM
తమ జట్టు విజయోత్సవాల్లో తొక్కిసలాట కారణంగా మృతి చెందిన వారికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నష్టపరిహారాన్ని పెంచింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఆర్‌సీబీ ఈ ఏడాది...
ఆర్‌సీబీ ప్రకటన
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): తమ జట్టు విజయోత్సవాల్లో తొక్కిసలాట కారణంగా మృతి చెందిన వారికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నష్టపరిహారాన్ని పెంచింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఆర్‌సీబీ ఈ ఏడాది విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు చేసుకునే సమయంలో బయట తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. ఆ సమయంలో ఆర్‌సీబీ రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. తాజాగా ఆర్‌సీబీ కేర్స్ పేరిట విడుదల చేసిన ప్రకటనలో ఒక్కో అభిమాని కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి