Archery Premier League: ఆర్చరీ లీగ్ విజేత రాజస్థాన్
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:23 AM
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ టైటిల్‌ను రాజ్‌పుతానా రాయల్స్ ఆఫ్ రాజస్థాన్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్స్‌లో రాయల్స్ - పృథ్వీరాజ్ యోధాస్...
ఫైనల్లో యోధాస్ ఓటమి
న్యూఢిల్లీ: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ టైటిల్‌ను రాజ్‌పుతానా రాయల్స్ ఆఫ్ రాజస్థాన్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్స్‌లో రాయల్స్ - పృథ్వీరాజ్ యోధాస్ జట్లు 4-4 స్కోరుతో సమంగా నిలవడంతో టై బ్రేకర్ అనివార్యమైంది. ఇందులో యోధాస్ ఆర్చర్లలో ఒక్కరు కూడా టార్గెట్‌లోని పసుపు చుక్కపై బాణాలను సంధించలేకపోయారు. రాయల్స్ ఆర్చర్లలో ఓజాస్, ఎల్లా గిబ్సన్ టార్గెట్‌కు సరిగ్గా గురి పెట్టి, లక్ష్యాన్ని ఛేదించడంతో ట్రోఫీ వారి సొంతమైంది.
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
For More National News And Telugu News