Share News

Head Coach Resignation: రాజస్థాన్‌ కోచింగ్‌కు ద్రవిడ్‌ గుడ్‌బై

ABN , Publish Date - Aug 31 , 2025 | 05:45 AM

ఐపీఎల్‌ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌ చీఫ్‌ కోచ్‌ పదవి నుంచి రాహుల్‌ ద్రవిడ్‌ వైదొలిగాడు. ఈ విషయాన్ని రాజస్థాన్‌ యాజమాన్యం శనివారం ప్రకటించింది. ‘పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా ద్రవిడ్‌కు...

Head Coach Resignation: రాజస్థాన్‌ కోచింగ్‌కు ద్రవిడ్‌ గుడ్‌బై

  • ఫ్రాంచైజీతో విభేదాలే కారణమా?

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌ చీఫ్‌ కోచ్‌ పదవి నుంచి రాహుల్‌ ద్రవిడ్‌ వైదొలిగాడు. ఈ విషయాన్ని రాజస్థాన్‌ యాజమాన్యం శనివారం ప్రకటించింది. ‘పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా ద్రవిడ్‌కు ఉన్నతమైన స్థానం కోసం ప్రతిపాదించాం. కానీ, అతడు దానిని తిరస్కరించాడు. జట్టును వీడాలనుకొన్నాడు’ అని ఎక్స్‌లో రాజస్థాన్‌ పోస్టు చేసింది. గతేడాది టీమిండియా కోచ్‌గా కాంట్రాక్ట్‌ ముగిసిన తర్వాత.. రాజస్థాన్‌ కోచ్‌గా ద్రవిడ్‌ నియమితులయ్యాడు. అయితే, కొన్నేళ్లపాటు జట్టుతో కొనసాగే విధంగా ఒప్పందం కుదుర్చుకొన్నా.. ఒక్క సీజన్‌కే తప్పుకోవడం గమనార్హం. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ కూడా తనను విడుదల చేయాలని ఫ్రాంచైజీని కోరినట్టు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు ద్రవిడ్‌ కూడా వైదొలగడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా కొత్త కెప్టెన్‌ విషయంలో యాజమాన్యంతో ద్రవిడ్‌ విభేదించాడనే వార్తలు వినవస్తున్నాయి. శాంసన్‌ జట్టును వీడే అవకాశాలు ఉండడంతో రియాన్‌ పరాగ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని ఫ్రాంచైజీ భావిస్తోందట. ఈ సీజన్‌లో గాయపడిన సంజూ బ్యాటింగ్‌కే పరిమితం కాగా.. పరాగ్‌ ఎక్కువ మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. అయితే, నిరుడు ప్లేఆఫ్స్‌ చేరిన రాయల్స్‌.. ఈ ఏడాది తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో పరాగ్‌కు సారథ్యం అప్పగించడంపై సుముఖంగా లేని ద్రవిడ్‌.. జట్టులోని జైస్వాల్‌, జురెల్‌ పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరాడట. అయితే, రాయల్స్‌ యాజమాన్యం మాత్రం పరాగ్‌వైపే మెగ్గుచూపుతుండడంతో.. జట్టును వీడాలని ద్రవిడ్‌ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 31 , 2025 | 05:45 AM