Share News

Rahul Dravid Resigns: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ద్రవిడ్ రాజీనామా.. కారణమేంటి?

ABN , Publish Date - Aug 30 , 2025 | 05:09 PM

రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రధాన కోచ్ పదవికి దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించింది. నిజానికి వచ్చే సీజన్‌కు కూడా ఆర్ఆర్ జట్టుకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించాల్సి ఉంది.

Rahul Dravid Resigns: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ద్రవిడ్ రాజీనామా.. కారణమేంటి?
Rahul Dravid

రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రధాన కోచ్ పదవికి దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించింది (Rahul Dravid quits). నిజానికి వచ్చే సీజన్‌కు కూడా ఆర్ఆర్ జట్టుకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించాల్సి ఉంది. అలాంటిది అకస్మాత్తుగా ఆ పదవి నుంచి తప్పుకుని అందరికీ షాకిచ్చాడు (Rajasthan Royals coach resignation).


రెండేళ్ల పాటు ఆర్ఆర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించేందుకు 2024లో ద్రవిడ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం 2026 వరకు ఆర్‌ఆర్ జట్టుతో ద్రవిడ్ ప్రయాణించాలి. అయితే ఇటీవల జరిగిన చర్చలో వచ్చే సీజన్‌లో హెడ్‌ కోచ్‌గా కొనసాగేందుకు ద్రవిడ్ నిరాకరించినట్లు తెలుస్తోంది. నిజానికి తాజా సీజన్‌లో ద్రవిడ్ కాలి గాయంతో బాధపడ్డాడు. అయినా వీల్‌‌చైర్‌లో కూర్చునే జట్టుకు తన సేవలు అందించాడు. అలాంటిది ఇంత హఠాత్తుగా రాజీనామా నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది ఎవరికీ అంతుబట్టడం లేదు (Dravid coaching news).


'రాజస్థాన్ జట్టుతో ద్రవిడ్ చాలా కాలం పాటు ప్రయాణించారు. ఫ్రాంచైజీలో అద్భుతమైన సాంప్రదాయం నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించారు. ఎంతో మంది ఆటగాళ్లను ప్రభావితం చేశారు. అయితే ఐపీఎల్-2026 సీజన్‌కు ముందే ద్రవిడ్ తన పదవి నుంచి వైదొలిగారు. ఫ్రాంఛైజీలో మరింత ఉన్నత స్థానం ఇస్తామని చెప్పినా తిరస్కరించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్, అభిమానుల తరఫు నుంచి ద్రవిడ్‌కు ధన్యవాదాలు చెబుతున్నాం' అని ఆర్‌ఆర్ టీమ్ పేర్కొంది.


ఇవి కూడా చదవండి

హర్భజన్ సింగ్ శ్రీశాంత్‌ చెంప ఛెళ్లుమనిపించిన ఘటన.. పాత వీడియోను షేర్ చేసిన లలిత్ మోదీ

బీసీసీఐలో కీలక మార్పులు.. కొత్త అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 30 , 2025 | 05:09 PM