సింధుకు గాయం
ABN , Publish Date - Feb 10 , 2025 | 05:25 AM
మరో రెండు రోజుల్లో ఆసియా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌ప జరగనున్న నేపథ్యంలో..భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కండర గాయంతో స్టార్ షట్లర్ పీవీ సింధు....

‘ఆసియా’ బ్యాడ్మింటన్ నుంచి అవుట్
న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో ఆసియా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌ప జరగనున్న నేపథ్యంలో..భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కండర గాయంతో స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నీ నుంచి వైదొలగింది. చైనాలోని క్వింగ్‌డావోలో ఈనెల 11 నుంచి 16 వరకు ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ జరగనుంది. ఇందుకోసం భారత జట్టు ప్రస్తుతం గువాహటిలో శిబిరంలో పాల్గొంటోంది. ‘శిబిరంలో శిక్షణ సందర్భంగా ఈనెల 4న గాయం అయ్యింది. కోలుకొనేందుకు.. ముందుగా అంచనా వేసిన సమయంకంటే ఎక్కువ పట్టనుందని ఎంఆర్‌ఐ స్కాన్ తర్వాత తెలిసింది. దాంతో ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షి్‌పలో పాల్గొనలేక పోతున్నందుకు ఎంతో విచారంగా ఉంది’ అని 29 ఏళ్ల సింధు ఆదివారం ఎక్స్‌లో వెల్లడించింది.
ఇవీ చదవండి:
భారత వన్డే జట్టులోకి కొత్త ప్లేయర్.. రోహిత్-గౌతీ గట్టి ప్లానింగ్
చాంపియన్స్ ట్రోఫీకి ఏకంగా 8 మంది స్టార్లు దూరం.. కమిన్స్, ఫెర్గూసన్ సహా..
టీమిండియాను రెచ్చగొడుతున్న పాక్ ప్రధాని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి