Jaipur Beat Haryana: కబడ్డీ సీజన్-12 నుంచి హర్యానా ఔట్
ABN , Publish Date - Oct 26 , 2025 | 08:36 AM
ప్రొ కబడ్డీ సీజన్-12లో డిఫెండింగ్ ఛాంపియన్ హర్యానా స్టీలర్స్ కథ ముగిసింది. శనివారం ప్లేఇన్స్‌లో జైపుర్ పింక్ పాంథర్స్ 30-27 తేడాతో హర్యానాను ఓడించింది. ఆరంభం నుంచి జైపుర్ దూకుడుగా ఆడింది. విరామ సమయానికి 18-10తో జైపుర్ పింక్ పాంథర్స్ ఆధిక్యంలో నిలిచింది.
క్రీడా న్యూస్: ప్రొ కబడ్డీ సీజన్-12లో డిఫెండింగ్ ఛాంపియన్ హర్యానా స్టీలర్స్ కథ ముగిసింది. శనివారం ప్లేఇన్స్‌లో జైపుర్ పింక్ పాంథర్స్ 30-27 తేడాతో హర్యానాను ఓడించింది. ఆరంభం నుంచి జైపుర్(Jaipur Pink Panthers) దూకుడుగా ఆడింది. విరామ సమయానికి 18-10తో జైపుర్ పింక్ పాంథర్స్ ఆధిక్యంలో నిలిచింది. ఇక బ్రేక్ తర్వాత హర్యానా బాగా పుంజుకుంది. అయినప్పటికీ జైపుర్(Jaipur Pink Panthers) ఎక్కడా పట్టు వదల్లేదు.
హర్యానాకు(Haryana Steelers) చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా చివరి వరకు జైపుర్ తన ఆధిక్యాన్ని కొనసాగించింది. నితిన్ (7), ఆర్యన్ (5) జైపుర్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ ఓటమితో హర్యానా(Haryana Steelers) టోర్నీ నుంచి ఔటవ్వగా.. జైపుర్ ఎలిమినేటర్‌కు అర్హత సాధించింది. మరో పోరులో పాట్నా పైరేట్స్ 40-31తో యు ముంబా( U Mumba)ను ఓడించింది. బ్రేక్ సమయానికి 20-15తో ముందంజలో నిలిచిన పాట్నా.. రెండో అర్ధంలోనూ అదే దూకుడు ప్రదర్శించి విజయాన్ని అందుకుంది. అయాన్ (14) పాట్నా(Patna Pirates Defeat U Mumba) తరఫున మెరిశాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
Alana king: ఆసీస్ ప్లేయర్ అలానా కింగ్ ప్రపంచ రికార్డ్
Rohit Sharma: ఫీల్డింగ్‌లోనూ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. అదెలాగంటే?