Share News

School Holidays: విద్యార్థులకు అలర్ట్.. మూడు రోజులు స్కూళ్లకు సెలవు

ABN , Publish Date - Oct 26 , 2025 | 08:06 AM

రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్‌ అన్సారియా కీలక ప్రకటన చేశారు. గుంటూరు జిల్లాలో 3 రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

School Holidays: విద్యార్థులకు అలర్ట్.. మూడు రోజులు స్కూళ్లకు సెలవు
Guntur school holiday

ఏపీ డెస్క్, ఆక్టోబర్ 26: ఆంధ్రప్రదేశ్ వైపు మొంథా తుఫాన్‌ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న(శనివారం) వాయుగుండంగా బలపడింది. కాకినాడకు(Kakinada) 920కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్‌ అన్సారియా కీలక ప్రకటన చేశారు. గుంటూరు జిల్లాలో 3 రోజులు పాఠశాలలకు(Guntur school holidays) సెలవులు ప్రకటించారు. 27, 28, 29న పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలానే అత్యవసరమైతే తప్ప జనాలు ఇళ్ల నుంచి బయటకి రావొద్దని ఆమె తెలిపారు.


'మొంథా'(Montha cyclone) తుపాను దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. సముద్రతీరాలు, నదుల్లో చేపల వేట, బోటింగ్ కార్యకలాపాలు నిలిపివేసింది. బీచ్‌లకు పర్యాటకులు రాకుండా చూడాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. తుపాను కారణంగా ఈ నెల 27, 28, 29, తేదీల్లో కృష్ణా జిల్లా(Krishna District)లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.


అలానే ఎన్టీఆర్(NTR District) జిల్లాలో కూడా మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఇతర విద్యాసంస్థలు అన్నింటికి 3 రోజుల పాటు సెలవు(school holiday news) ఇస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులందరూ ఈనెల 26వ తేదీ సాయంత్రంలోగా ఇళ్లకు వెళ్లే విధంగా అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.


ఇవి కూడా చదవండి..

Investment in Adani Raises: జీవిత బీమా..అదానీకి ధీమా

Congress Demands: పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్‌

Updated Date - Oct 26 , 2025 | 08:22 AM