Share News

ఆ రాశి వారు ఈ వారం లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి..

ABN , Publish Date - Oct 26 , 2025 | 07:56 AM

ఆ రాశి వారు ఈ వారం లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అలాగే.. స్థిరాస్తి ధనం అందుతుందని, అయితే.. ఖర్చులు తగ్గించుకుంటే మంచిదని తెలుపుతున్నారు. ఇంకా ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే...

ఆ రాశి వారు ఈ వారం లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి..

అనుగ్రహం

26 అక్టోబర్‌ - 1 నవంబర్‌ 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. కొత్తయత్నాలు మొదలెడతారు. తల పెట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహం కలిగిస్తుంది. వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. సన్నిహితులతో తరచూ సంభాషిస్తారు. అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అనుభవజ్ఞుల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

నిర్విరామంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయానికి తగినట్టుగా లెక్కలేసుకుంటారు. పెట్టుబడులు కలిసిరావు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. అనవసర జోక్యం తగదు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. ఎవరినీ నొప్పించవద్దు. పెద్దమొత్తం చెల్లింపుల్లో జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులు కలిసి వస్తాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం మంచి ఫలితమిస్తుంది. పనుల పట్ల అశ్రద్థ తగదు. కార్యదీక్షతో శ్రమిస్తేనే లక్ష్యం సాధ్యమవుతుంది. బంధువులతో సంభాషి స్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. సన్నిహితుల రాక ఉత్సాహం కలిగిస్తుంది. పక్కవారి నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి.


కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

లక్ష్యం నెరవేరుతుంది. మాట నిలబెట్టుకుంటారు. పరిచయాలు బలపడ తాయి. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. వివాహయత్నం ఫలించే సూచన లున్నాయి. అవకాశాలు చేజార్చుకోవద్దు. మొండిగా యత్నాలు కొనసాగిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఒత్తిళ్లకు గురికావద్దు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. దీక్షలు స్వీకరిస్తారు.


సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

లక్ష్యసిద్థికి ఓర్పు, కృషి ప్రధానం. పెద్దల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో అడుగు ముందుకే స్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయం ఫర్వాలేదని పిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. చెల్లిం పుల్లో జాగ్రత్త. మీ ఏమరుపాటుతనం సమ స్యాత్మకమవుతుంది. ఆపత్సమయంలో పరిచ యస్తులు సాయం అందిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది.


కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. అనుభవజ్ఞులను సంప్రదించండి. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. మీ నిర్ణయంపై పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది. పనులు, బాధ్యతలు పురమాయించ వద్దు. మీ అభిప్రాయాలను సౌమ్యంగా తెలియజేయండి. విజ్ఞతతో సమస్య పరిష్కరించుకుంటారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.


తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

కార్యసఫలీకృతకు మరింత శ్రమించాలి. కొందరి వ్యాఖ్యలు నీరుగారు స్తాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. పనులు మధ్యలో ఆపివేయవద్దు. రుణదాతల ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితులు సాయం అందిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. మీపై శకునాల ప్రభావం అధికం. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయినవారితో సంభాషిస్తారు. కీలక పత్రాలు అందుతాయి.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

ప్రతికూలతలు అధికం. ఆశావహదృక్పథంతో మెలగండి. అవాంతరా లెదురైనా పనులు నిలిపివేయొద్దు. అవకా శం చేజారిపోతుంది. ఇదీ ఒకందుకు మంచికే. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందు గానే గ్రహిస్తారు. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. కష్టసమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

కలిసివచ్చే సమయం. కష్టం ఫలిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. విలాసాలకు ఖర్చు చేస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. కీలక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

స్థిరాస్తి ధనం అందుతుంది. అయితే ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. నిర్విరామంగా శ్రమి స్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. అనాలో చిత నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. సంస్థల స్థాపనలకు అనుకూలం. అవతలి వారి గురించి పూర్తిగా తెలుసుకోండి.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

గ్రహస్థితి సామాన్యం. కార్యసిద్థికి పట్టుదలతో శ్రమించాలి. సాయం ఆశించి భంగపడతారు. కొందరి వ్యాఖ్యల ప్రభావం మీపై అధికంగా ఉంటుంది. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనో ధైర్యంతో ముందుకు సాగుతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. సకాలంలో చెల్లిం పులు జరుపుతారు. అనుకోని సంఘటన ఎదు రవుతుంది. అయినవారితో సంభాషిస్తారు.


మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

దృఢసంకల్పంతో శ్రమిస్తే విజయం తధ్యం. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. చేస్తున్న పనులపై దృష్టిపెట్టండి. కొత్తసమస్య ఎదురయ్యే ఆస్కారం ఉంది. దూకుడుగా వ్యవహరించవద్దు. అందరితోనూ మితంగా సంభాషించండి. చెల్లింపుల్లో అప్రమ త్తంగా ఉండాలి. అనుభవజ్ఞులను సంప్రదిం చండి. మీజోక్యంతో ఒక వివాదం సద్దుమణు గుతుంది. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు.

Updated Date - Oct 26 , 2025 | 07:56 AM