World Athletics Championship 100m Winners: 100 మీటర్ల విజేతలు మెలిస్సా సెవిల్లె
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:29 AM
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన 100 మీటర్ల రేసులో కొత్త చాంపియన్లు అవతరించారు. పురుషుల వంద మీటర్ల టైటిల్‌ను జమైకాకు చెందిన 24 ఏళ్ల ఒబ్లిక్ సెవిల్లె...
ప్రపంచ అథ్లెటిక్స్
టోక్యో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన 100 మీటర్ల రేసులో కొత్త చాంపియన్లు అవతరించారు. పురుషుల వంద మీటర్ల టైటిల్‌ను జమైకాకు చెందిన 24 ఏళ్ల ఒబ్లిక్ సెవిల్లె ఎగరేసుకుపోయాడు. ఫైనల్ రేసును సెవిల్లె 9.77 సెకన్లలో ముగించాడు. ఈ క్రమంలో ఉస్సేన్ బోల్ట్ తర్వాత ప్రపంచ చాంపియన్‌షి్‌పలో పురుషుల 100 మీటర్ల స్వర్ణం నెగ్గిన జమైకా అథ్లెట్‌గా సెవిల్లె చరిత్రకెక్కాడు. జమైకాకే చెందిన ఫేవరెట్ కిషానె థాంప్సన్ 9.82 సెకన్ల టైమింగ్‌తో రెండోస్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక, టైటిల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా స్టార్ నోవా లైల్స్ (9.89 సెకన్లు) మూడో స్థానంతో కాంస్యానికి పరిమితమయ్యాడు. పారిస్ ఒలింపిక్స్ మహిళల 100 మీటర్లలో కాంస్య పతకం గెలిచిన అమెరికా యువ కెరటం మెలిస్సా జెఫర్సన్ వుడెన్.. ప్రపంచ చాంపియన్‌షి్‌పలో మాత్రం స్వర్ణంతో మెరిసింది. పారిస్ విశ్వక్రీడల చాంప్ జులియన్ అల్‌ఫ్రెడ్, షెకారి రిచర్డ్‌సన్, షెరికా జాక్సన్‌లాంటి స్టార్లను వెనక్కి నెడుతూ 24 ఏళ్ల మెలిస్సా ఫైనల్లో 10.61 సెకన్ల టైమింగ్‌తో తొలిసారి విజేతగా నిలిచింది. జమైకా అథ్లెట్ టినా క్లేటన్ (10.76 సెకన్లు) రజతం దక్కించుకోగా, సెయింట్ లూసియాకు చెందిన జులియన్ అల్‌ఫ్రెడ్ (10.84 సెకన్లు) కాంస్యానికి పరిమితమైంది. తనకు ఇదే చివరి ప్రపంచ చాంపియన్‌షిప్ అని ప్రకటించిన జమైకా దిగ్గజ అథ్లెట్, 38 ఏళ్ల షెల్లీ అన్‌ఫ్రేజర్ (11.03 సె) ఆరో స్థానంలో నిలిచింది. షెరికా జాక్సన్ (జమైకా- 10.88 సె), షకారి రిచర్డ్‌సన్ (అమెరికా- 10.94 సె) వరుసగా నాలుగు, ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నారు.
భారత్ షెడ్యూల్ నేడు
ఉ. 7 గం.: మహిళల 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ హీట్స్ - పారుల్ చౌదరి, అంకితా ధ్యాని; సా. 4.10 గం: పురుషుల లాంగ్‌జంప్ క్వాలిఫికేషన్స్ - మురళీ శ్రీశంకర్; సా. 4.53 గం: పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ హీట్స్ - తేజాస్ షిర్సే
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి