US Open 2025: ప్రీక్వార్టర్స్‌కు జొకో
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:53 AM
స్టార్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో జోరు కొనసాగిస్తున్నాడు. రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన ఈ మాజీ చాంపియన్ సింగిల్స్‌లో ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన మూడో రౌండ్లో...
అల్కారజ్, సబలెంక, గాఫ్ కూడా
యూఎస్ ఓపెన్‌లో ఆండ్రీవ అవుట్
న్యూయార్క్: స్టార్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో జోరు కొనసాగిస్తున్నాడు. రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన ఈ మాజీ చాంపియన్ సింగిల్స్‌లో ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన మూడో రౌండ్లో 7వ సీడ్ జొకోవిచ్ 6-4, 6-7(4), 6-2, 6-3తో కామ్ నోరిని ఓడించాడు. ఓవైపు వెన్నునొప్పితో బాధపడుతూనే ఆటను కొనసాగించిన 38 ఏళ్ల జొకో మ్యాచ్‌లో ఏకంగా 18 ఏస్‌లు సంధించడం విశేషం. ఈ గెలుపుతో 1991లో జిమ్మీ కానర్స్ (38 ఏళ్ల వయసులో) తర్వాత యూఎస్ ఓపెన్‌లో నాలుగో రౌండ్ చేరిన అతిపెద్ద వయస్కుడిగా జొకో రికార్డు సృష్టించాడు. మూడోరౌండ్లో 4వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ 7-6(3), 6-7 (11), 6-4, 6-4తో జెరోమ్ కిమ్‌పై నెగ్గగా, జర్మనీ క్వాలిఫయర్ జాన్ లెనార్డ్ స్ట్రఫ్ 6-4, 6-3, 7-6(7)తో 17వ సీడ్ టియాఫోను కంగుతినిపించాడు. 2వ సీడ్ అల్కారజ్ 6-2, 6-4, 6-0తో లూసియానోని ఓడించి ప్రీక్వార్టర్స్ చేరాడు. అడ్రియన్ మనారియాతో పోరులో 6-3, 3-6, 6-4, 4-6తో ఉన్న దశలో 6వ సీడ్ బెన్ షెల్టన్ గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో అమెరికాకు చెందిన 29 ఏళ్ల టేలర్ టౌన్‌సెండ్ 7-5, 6-2తో 5వ సీడ్ మిర్రా ఆండ్రీవకు షాకిచ్చింది. మరో మ్యాచ్‌లో క్రెజికోవా 4-6, 6-4, 6-4తో 10వ సీడ్ ఎమ్మా నవారోను చిత్తుచేయగా.. టాప్‌సీడ్ సబలెంక 6-3, 7-6 (2)తో లైలా ఫెర్నాండెజ్‌ను, లోకల్ స్టార్, 3వ సీడ్ కొకొ గాఫ్ 6-3, 6-1తో మాగ్ధలినాను ఓడించి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
అనిరుధ్ జోడీ బోణీ: పురుషుల డబుల్స్‌లో భారత జోడీ అనిరుధ్ చంద్రశేఖర్/విజయ్ ప్రశాంత్ శుభారంభం చేసింది. తొలిరౌండ్లో హారిసన్/ఎవాన్ ద్వయంపై గెలిచింది. ఇక, రుత్విక్/శ్రీరామ్ జంట తొలి రౌండ్లోనే ఓడింది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి