Durand Cup 2025: నార్త్ ఈస్ట్ నయా చరిత్ర
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:58 AM
డిఫెండింగ్ చాంపియన్ నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ స్థాయికి తగ్గ ఆటతీరుతో చెలరేగింది. డ్యూరాండ్ కప్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో యునైటెడ్ జట్టు 6-1 తేడాతో...
వరుసగా రెండోసారి డ్యూరాండ్ కప్ కైవసం
కోల్‌కతా: డిఫెండింగ్ చాంపియన్ నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ స్థాయికి తగ్గ ఆటతీరుతో చెలరేగింది. డ్యూరాండ్ కప్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో యునైటెడ్ జట్టు 6-1 తేడాతో డైమండ్ హార్బర్ ఎఫ్‌సీని చిత్తు చేసింది. దీంతో 34 ఏళ్ల తర్వాత వరుసగా రెండుసార్లు టైటిల్ నెగ్గిన జట్టుగా నార్త్ ఈస్ట్ నయా చరిత్ర సృష్టించింది. తొలి అర్ధగంటపాటు ఇరుజట్లు హోరాహోరీగా పోరాడడంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. చివరికి అషీర్ అక్తర్ (30వ నిమిషంలో) నార్త్ ఈస్ట్‌కు బోణీ చేశాడు. ఆ తర్వాత చెలరేగిన నార్త్ ఈస్ట్ ఆటగాళ్లు పార్తీబ్ (45), థోయ్ (50), జైరో (81), గైతాన్ (86), అజరే (90) తమ జట్టుకు గోల్స్ అందించారు. అటు డైమండ్ హార్బర్‌కు లభించిన ఏకైక గోల్ 68వ నిమిషంలో మైకేల్ కొర్తజార్ అందించాడు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి