Pycroft Apology-Pak Trolled: పైక్రాఫ్ క్షమాపణ వ్యవహారం.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పాక్
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:31 PM
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ తమకు క్షమాపణలు చెప్పినట్టు వీడియోను వైరల్ చేయించిన పాక్ చివరకు విమర్శల పాలైంది. తన వాదనలకు రుజువుగా ఆడియో లేని వీడియో షేర్ చేసి ట్రోలర్లకు అడ్డంగా దొరికిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ ఉదంతంలో పాక్ జట్టు మరోసారి నవ్వుల పాలయ్యింది. పైక్రాఫ్ట్‌కు సంబంధించి ఓ వీడియోను షేర్ చేసిన పాక్.. తన తప్పునే తానే బయటపెట్టుకుంది. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తమ జట్టులో ఎప్పటికీ మార్పు రాదంటూ పాక్ అభిమానులు కూడా నిరాస వ్యక్తం చేస్తున్నారు. నిర్వేదంలో కూరుకుపోయారు (muted video referee apology).
పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా, ప్రధాన కోచ్ హెసెన్‌తో పాటు పీసీబీ మేనేజర్, రెఫరీ పైక్రాఫ్ట్ ఆ వీడియోలో ఉన్నారు. ఈ సమావేశంలో సందర్భంగానే పైక్రాఫ్ట్ తమకు సారీ చెప్పినట్టు పాక్ వీడియోను షేర్ చేస్తూ ప్రచారం చేసుకుంది. అయితే, పైక్రాప్ట్ క్షమాపణలు చెబుతున్నట్టు వీడియోలో ఎక్కడా వినిపించలేదు. దీంతో, పాక్‌పై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. స్వయంగా పాక్ జట్టు అభిమానులు కూడా విమర్శలకు దిగారు. ఇలాంటి సిల్లీ పొరపాట్లు చేస్తూ తమ టీమ్ అడ్డంగా బుక్కయిపోతోందని అనేక మంది మండిపడ్డారు. ఇక క్రికెట్ అభిమానుల విమర్శలకైతే అంతేలేకుండా పోయింది (handshake controversy Asia Cup).
ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఇటీవల పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు ప్రత్యర్థి ప్లేయర్లను పరోక్షంగా బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే. పాక్ ప్లేయర్లకు టీమిండియా క్రికెటర్లు కనీసం కరచాలనం కూడా చేయలేదు. ఇది అవమానంగా భావించిన పాక్.. ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలగుతానని ప్రగల్భాలు పలికింది. పైక్రాఫ్ట్‌ను రెఫరీగా తప్పించాల్సిందేనని స్పష్టం చేసింది. కానీ ఐసీసీ మాత్రం ఇందుకు ససేమీరా అనడంతో పాక్ వెనకడుగు వేయకతప్పలేదు. ఇది చాలదన్నట్టు యూఏఈ-పాక్ మ్యాచ్‌లో కూడా పైక్రాఫ్ట్ రెఫరీగా నిలిచారు. ఈ క్రమంలోనే పైక్రాప్ట్ పాక్‌కు క్షమాపణలు చెప్పన వీడియో కూడా వైరల్‌గా మారింది. చివరకు ఈ మొత్తం ఎపిసోడ్‌లో పాక్ మరోసారి విమర్శలను మూటగట్టుకుంది.
ఇవి కూడా చదవండి
మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారు: పీసీబీ
జావెలిన్ త్రోలో ఫైనల్ చేరిన భారత్ పాక్ స్టార్లు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి