Andy Pycroft Apology: మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారు: పీసీబీ
ABN , Publish Date - Sep 18 , 2025 | 08:44 AM
హ్యాండ్ షేక్ వివాదంలో మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ తమకు క్షమాపణ చెప్పారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: హ్యాండ్ షేక్ కాంట్రవర్సిలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వివాదానికి కేంద్రంగా ఉన్న మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ తమకు క్షమాపణ చెప్పారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా పేర్కొంది. తమ మేనేజర్‌కు, పాక్ క్రికెట్ కెప్టెన్ సల్మాన్‌కు పైక్రాప్ట్ సారీ చెప్పారని వెల్లడించింది (Andy Pycroft apology).
‘యాండీ పైక్రాఫ్ట్ చర్యలను పాక్ తీవ్రంగా పరిగణించింది. అయితే, నాటి ఘటనలు విచారకరమని పైక్రాఫ్ట్ తెలిపారు. క్షమాపణలు చెప్పారు. సమాచారం ఇచ్చిపుచ్చుకొనే క్రమంలో పొరపాటు జరిగిందని అన్నారు. ఈ విషయంలో ఎంక్వైరీ జరిపేందుకు ఐసీసీ సంసిద్ధత వ్యక్తం చేసింది’ అని పీసీబీ పేర్కొంది (Asia Cup 2025 Handshake Row).
అయితే, ఈ క్షమాపణ వెనక ఓ ట్విస్ట్ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో లోపం జరిగినందుకు మాత్రమే పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పైక్రాఫ్ట్ తప్పు చేసినట్టు పీసీబీ మరిన్ని ఆధారాలు చూపించగలిగితేనే తాము విచారణ ప్రారంభిస్తామని ఐసీసీ చెప్పినట్టు తెలిసింది ( Pakistan vs India controversy).
పాక్ జట్టుతో టీమిండియా క్రికెటర్లు చేయి కలిపేందుకు సుముఖంగా లేరన్న విషయాన్ని పైక్రాఫ్ట్ పాక్ జట్టుకు చేరవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక సెప్టెంబర్ 14 మ్యాచ్ టాస్ సమయంలో భారత్, పాక్ జట్ల కెప్టెన్లు పరస్పరం కరచాలనం చేయని విషయం తెలిసిందే. తాము సరైన నిర్ణయమే తీసుకున్నామని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల స్పష్టం చేశారు. పహల్గాం బాధితులకు సంఘీభావం తెలిపిన ఆయన.. మ్యా్చ్‌లో విజయాన్ని వారికి అంకితమిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు.
ఇక ఈ వివాదానికి కేంద్రంగా ఉన్న పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ పట్టుబట్టింది. ఐసీసీకి లేఖ కూడా రాసింది. కానీ ఐసీసీకి ఇందుకు నిరాకరించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పీసీబీ తాజా ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పడ్డట్టేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
జావెలిన్ త్రోలో ఫైనల్ చేరిన భారత్ పాక్ స్టార్లు
India Women Cricket: మంధాన శతక మోత
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి