India Women Cricket: మంధాన శతక మోత
ABN , Publish Date - Sep 18 , 2025 | 06:03 AM
డాషింగ్ ఓపెనర్ స్మృతీ మంధాన (91 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 117) సెంచరీతోపాటు బౌలర్లు రాణించడంతో.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీ్‌సను భారత్ 1-1తో సమం చేసింది...
రెండో వన్డేలో ఆసీ్‌సపై భారత్ ఘన విజయం
ముల్లన్‌పూర్ (పంజాబ్): డాషింగ్ ఓపెనర్ స్మృతీ మంధాన (91 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 117) సెంచరీతోపాటు బౌలర్లు రాణించడంతో.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీ్‌సను భారత్ 1-1తో సమం చేసింది. బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 102 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా 2007 తర్వాత స్వదేశంలో తొలిసారి కంగారూలపై భారత్ జయకేతనం ఎగురువేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.5 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ (40), రిచా ఘోష్ (29), ప్రతీక రావల్ (25) ఫర్వాలేదనిపించగా.. చివర్లో స్నేహ్ రాణా (24) రాణించింది. ఓపెనర్లు ప్రతీక, మంధాన తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. హర్లీన్ డియోల్ (10), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (17) విఫలమయ్యారు. డార్సీ బ్రౌన్ 3 వికెట్లు పడగొట్టింది. ఛేదనలో ఆసీస్ 40.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. సదర్లాండ్ (45), ఎలీస్ పెర్రీ (44) టాప్ స్కోరర్లు. క్రాంతి గౌడ్ మూడు, దీప్తి రెండు వికెట్లు పడగొట్టారు. ఆసీ్‌సపై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. మంధాన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఇరుజట్ల మధ్య సిరీస్ నిర్ణాయక మూడో, ఆఖరి మ్యాచ్ శనివారం జరగనుంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 49.5 ఓవర్లలో 292 ఆలౌట్ (మంధాన 117, దీప్తి శర్మ 40; బ్రౌన్ 3/42).
ఆస్ట్రేలియా: 40.5 ఓవర్లలో 190 ఆలౌట్ (సదర్లాండ్ 45, పెర్రీ 44; క్రాంతి 3/28).
1
వంద అంతకుపైగా పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడడం ఆ జట్టుకిదే తొలిసారి.
2
77 బంతుల్లో సెంచరీ సాధించిన మంధాన.. భారత్ తరఫున రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసింది. తొలి సెంచరీ కూడా ఆమె పేరిటే ఉంది. ఐర్లాండ్‌పై మంధాన 70 బంతుల్లోనే వంద సాధించింది.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి