Javelin Throw Final: జావెలిన్ త్రోలో ఫైనల్ చేరిన భారత్ పాక్ స్టార్లు
ABN , Publish Date - Sep 18 , 2025 | 06:16 AM
క్రికెట్‌లో ఇండో-పాక్ పోరు ఎంత మజానో.. అథ్లెటిక్స్‌లో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ మధ్య పోటీ అంతే ఆసక్తికరం. జావెలిన్ త్రోలో వీరిద్దరు తలపడుతున్నారంటే...
నీరజ్ X నదీమ్
ఫైనల్స్ సా. 3.50 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో..
నేడు జావెలిన్ త్రో టైటిల్ పోరు
ఫైనల్ చేరిన భారత్, పాక్ స్టార్లు
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్
టోక్యో: క్రికెట్‌లో ఇండో-పాక్ పోరు ఎంత మజానో.. అథ్లెటిక్స్‌లో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ మధ్య పోటీ అంతే ఆసక్తికరం. జావెలిన్ త్రోలో వీరిద్దరు తలపడుతున్నారంటే రెండు దేశాల అథ్లెటిక్స్ ప్రేమికులేకాదు..విశ్వవ్యాప్త ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తారు. అలాంటి నీరజ్-నదీమ్ మరోసారి ఢీ అంటే ఢీ అనబోతున్నారు. గురువారం జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్స ఫైనల్లో వీరిద్దరూ అమీతుమీ తేల్చుకోనున్నారు. బుధవారం జరిగిన జావెలిన్ త్రో క్వాలిఫికేషన్స్‌లో డిఫెండింగ్ చాంప్ నీరజ్, నదీమ్ భిన్నమైన ప్రదర్శన చేశారు. గ్రూప్ ‘ఎ’ నుంచి తలపడిన నీరజ్.. ఫైనల్ మార్క్ 84.50 మీ. దూరాన్ని మొదటి యత్నంలోనే (84.85 మీ.తో) చేరుకున్నాడు. గ్రూపులో చోప్రా మూడో, ఓవరాల్‌గా ఆరో స్థానంలో నిలిచాడు. మరోవైపు అర్షద్ గ్రూప్ ‘బి’లో ఉత్కంఠ పరిస్థితులు ఎదుర్కొన్నాడు. మొదటి రెండు యత్నాలలో (76.99మీ.), (74.17మీ.) విఫలమైన అతడు మూడో ఆఖరి త్రోలో 85.25మీ. ఈటెను విసిరాడు. కానీ గ్రూప్ ‘బి’లో నాలుగో ఆటోమేటిక్ క్వాలిఫయర్‌గా ఫైనల్లో స్థానం దక్కించుకుని ఊపిరి పీల్చుకున్నాడు. 84.50 మీ. దూరాన్ని అందుకున్నవారు లేదా అత్యుత్తమ ప్రదర్శన చేసిన 12 మంది ఫైనల్లో తలపడతారు.
సచిన్ యాదవ్ కూడా: మరో భారత త్రోయర్ సచిన్ యాదవ్ 83.67 మీ. దూరంతో ఓవరాల్‌గా 10వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాడు. మరో ఇద్దరు భారత త్రోయర్లు రోహిత్ 28వ, యశ్వీర్ 30వ స్థానాల్లో నిలిచి ఫైన ల్‌కు ముందే నిష్క్రమించారు. క్వాలిఫకేషన్స్‌లో ఓవరాల్‌గా అండర్సన్ పీటర్స్ (89.53 మీ.) అగ్రస్థానం, జులియన్ వెబర్ (87.21 మీ) రెండో స్థానంలో నిలిచారు.
మిగిలిన అందరూ విఫలం..
పురుషుల ట్రిపుల్ జంప్‌లో భారత అథ్లెట్ అబ్దుల్లా అబూబాకర్ (16.33మీ.), ప్రవీణ్ చిత్రవేల్ (16.74మీ.) ఫైనల్‌కు చేరడంలో విఫలమయ్యారు. పురుషుల 200 మీ. పరుగు హీట్స్‌లో అనిమేష్ కుజుర్ తన హీట్‌లో తొమ్మిదో, ఆఖరి స్థానంలో నిలిచి నిరాశపరిచాడు.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి