MS Dhoni: ఐపీఎల్ పై అభిమాని ప్రశ్న.. ధోనీ ఫన్నీ రిప్లై..
ABN , Publish Date - Aug 11 , 2025 | 10:46 AM
ధోనీని తమిళ అభిమానులు ఎంతగానో అభిమానిస్తారు. ధోనీని పసుపు రంగు జెర్సీలో చూసి మురిసిపోతారు. ధోనీ ఎప్పటికీ ఐపీఎల్ ఆడుతూనే ఉండాలని కోరుకుంటారు. అయితే మోకాలి నొప్పితో బాధపడుతున్న ధోనీ వచ్చే సీజన్ ఆడతాడో, లేదో ఇంకా క్లారిటీ లేదు.
టీమిండియా మాజీ లెజెండ్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగి ఐదేళ్లు పూర్తయింది. అయితే ఐపీఎల్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున మాత్రం ధోనీ ఆడుతున్నాడు. ధోనీని తమిళ అభిమానులు ఎంతగానో అభిమానిస్తారు. ధోనీని పసుపు రంగు జెర్సీలో చూసి మురిసిపోతారు. ధోనీ ఎప్పటికీ ఐపీఎల్ ఆడుతూనే ఉండాలని కోరుకుంటారు. అయితే మోకాలి నొప్పితో బాధపడుతున్న ధోనీ వచ్చే సీజన్ ఆడతాడో, లేదో ఇంకా క్లారిటీ లేదు.
తాజాగా ధోనీ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో ధోనీకి వచ్చే ఐపీఎల్‌లో ఆడతారా? అనే ప్రశ్న ఎదురైంది. వ్యాఖ్యాతల నుంచి వచ్చిన ఆ ప్రశ్నకు ధోనీ స్పందిస్తూ.. 'వచ్చే సీజన్ ఆడతానో లేదో తెలియదు. అయినా అందుకు ఇంకా చాలా సమయం ఉంది. డిసెంబర్‌లో నిర్ణయం తీసుకుంటా. ఇప్పుడే చెప్పడం సరైంది కాదు' అని ధోనీ చెప్పాడు. ఆ సమయంలో ఓ అభిమాని.. 'మీరు తప్పకుండా ఆడాలి సర్' అని అరిచాడు. దానికి ధోనీ స్పందిస్తూ.. 'నా మోకాలు నొప్పిగా ఉంది. దానిని ఎవరు భరిస్తారు' అని సరదాగా ప్రశ్నించాడు.
గత సీజన్ అంతా ధోనీ మోకాలి నొప్పితోనే బ్యాటింగ్ చేశాడు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి రన్స్ తీయకుండా బౌండరీలతో హోరెత్తించాడు. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా దూరం కావడంతో కెప్టెన్సీ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. అయితే చెన్నై టీమ్ పేలవ ప్రదర్శనతో అసలు పోటీలోనే లేకుండా పోయింది. వచ్చే సీజన్‌లో ధోనీ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగకపోయినప్పటికీ కోచింగ్ బాధ్యతలు మాత్రం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఖరీదైన కారు కొన్న రోహిత్ శర్మ.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ మరో షాకింగ్ డెసిషన్..?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..