Abhishek Sharma: అభిషేక్ శర్మను ఎదుర్కోవడానికి సిద్ధం: మిచెల్ మార్ష్
ABN , Publish Date - Oct 28 , 2025 | 06:09 PM
ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టీ20ల సిరీస్ ఆడటానికి సిద్ధమైంది. అక్టోబర్ 29(బుధవారం)కాన్‌బెర్రా వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఎప్పటిలాగే టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడాడు. అభిషేక్ శర్మను ఎదుర్కోవడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టీ20ల(India vs Australia T20) సిరీస్ ఆడటానికి సిద్ధమైంది. అక్టోబర్ 29(బుధవారం)కాన్‌బెర్రా(Canberra T20 match) వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఎప్పటిలాగే టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma)పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్( Mitchell Marsh) మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడాడు. అభిషేక్ శర్మను ఎదుర్కోవడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని స్పష్టం చేశాడు.
‘అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటగాడు. ఐపీఎల్(IPL)లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. నిజానికి అతడు మాకో ఛాలెంజ్. కానీ మేం అతడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడి మనల్ని మనం పరీక్షించుకోవాలి’ అని కెప్టెన్ మిచెల్ మార్ష్ అన్నాడు.
బరిలోకి ఇంగ్లిష్..
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్(Josh Inglis comeback) ఇటీవల జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. దీనిపై ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించాడు. ‘గాయం కారణంగా ఇంగ్లిష్ న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. టీ20 సిరీస్‌లో జట్టుకు అందుబాటులో ఉన్నాడు. అతడు మాకు చాలా ముఖ్యమైన ప్లేయర్. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు’ అని మార్ష్ వివరించాడు.
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అతడు 23 ఇన్నింగ్స్‌లో 36.91 యావరేజ్‌తో 849 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీమిండియా, ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 32 టీ20ల్లో తలపడగా.. 20 మ్యాచుల్లో భారత జట్టు విజయం సాధించింది. ఆసీస్ జట్టు 11 మ్యాచుల్లో గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. గత మూడు టీ20 సిరీస్‌ల్లోనూ భారత జట్టు కంగారూలను ఓడించింది.
Also Read:
అతడు ఫామ్‌లో ఉంటే.. హేజిల్‌వుడ్‌కు కష్టమే: అభిషేక్ నాయర్