Abhishek Sharma: అతడు ఫామ్‌లో ఉంటే.. హేజిల్‌వుడ్‌కు కష్టమే: అభిషేక్ నాయర్
ABN , Publish Date - Oct 28 , 2025 | 05:29 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్‌లో ఉంటే.. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఫామ్ కోల్పోతాడని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ అన్నాడు. అభిషేక్ శర్మను పరుగులు చేయకుండా ఆపడం చాలా కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
‘అభిషేక్ శర్మ ఫామ్‌లో ఉంటే.. హేజిల్‌వుడ్ కచ్చితంగా తన ఫామ్ కోల్పోతాడు. అభిషేక్ శర్మ తాను ఎదుర్కొనే తొలి బంతినే సిక్స్ లేదా ఫోర్ కొట్టాలని భావిస్తాడు. పవర్ ప్లే మాత్రమే కాదు.. తాను క్రీజులో ఉన్నంత సేపు అదే దూకుడు ప్రదర్శిస్తాడు. అభిషేక్ ఆరు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే సులువుగా 60 నుంచి 80 పరుగులు రాబడతాడు. దీంతో మరో ఎండ్‌లో ఉన్న తన సహచరుడిపై ఒత్తిడి తగ్గుతుంది. కానీ ప్రత్యర్థి జట్టుకు మాత్రం ఒత్తిడి పెరుగుతుంది.
ముఖ్యంగా ఆసీస్ పేసర్ హేజిల్‌వుడ్ మంచి రిథమ్‌లో ఉన్నాడు.అభిషేక్ శర్మ అతడిని ఎలా ఎదుర్కొంటాడనేదే ఆసక్తికరం. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా బౌన్స్ ఉంటుంది. అభిషేక్ శర్మకు ఐపీఎల్(IPL), సౌతాఫ్రికాలో ఆడిన అనుభవం ఉంది. అతడిని ఎదుర్కోవడానికి అది సరిపోతుంది. ఆస్ట్రేలియాలో ఫియర్‌లెస్ క్రికెట్ ఆడటానికి అభిషేక్‌కు ఇదే మంచి అవకాశం. ఈ సిరీస్‌లో అతడు కచ్చితంగా రాణిస్తాడనే నమ్మకం ఉంది’ అని అభిషేక్ నాయర్ వ్యాఖ్యానించాడు.
కాగా అక్టోబర్ 29(బుధవారం) నుంచి టీమిండియాతో ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. కాగా తొలి మ్యాచ్ కాన్‌బెర్రా వేదికగా జరగనుంది. తాజాగా మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 2-1తేడాతో సిరీస్ ఓడిపోయింది. వన్డేల్లో హేజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడి పేస్ ధాటికి బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.
Also Read:
నా మీద కేసులు నిజమైతే రాజకీయాలు వదిలేస్తా.. నవీన్ యాదవ్ మాస్ సవాల్