Messi Match: భారత్‌లో మెస్సీ విన్యాసాలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:46 AM
ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీ అద్భుత విన్యాసాలను భారత ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూసే అవకాశం రానుంది. ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం నవంబరులో అర్జెంటీనా జట్టు కేరళకు రాబోతోంది. ఈ విషయాన్ని,,,
కేరళలో అర్జెంటీనా జట్టు పోరు
న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీ అద్భుత విన్యాసాలను భారత ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూసే అవకాశం రానుంది. ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం నవంబరులో అర్జెంటీనా జట్టు కేరళకు రాబోతోంది. ఈ విషయాన్ని అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘం కూడా ధ్రువీకరించింది. అయితే, ఆ జట్టు ఎవరితో మ్యాచ్ ఆడుతుందనేది స్పష్టం చేయలేదు. కాగా, నవంబరు 10-18 మధ్య అర్జెంటీనా మ్యాచ్ ఉండే అవకాశముందని కేరళ క్రీడామంత్రి అబ్దుర్ రహిమాన్ వెల్లడించారు. ‘లియోనెల్ మెస్సీ నేతృత్వంలో అర్జెంటీనా జట్టు ఈ ఏడాది అక్టోబరులో యూఎ్‌సఏ, నవంబరులో భారత్ పర్యటనలో రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లను ఆడనుంది’ అని అర్జెంటీనా ఫుట్‌బాల్ సమాఖ్య పేర్కొంది. మరోవైపు మెస్సీ మూడు రోజుల పర్యటన కోసం డిసెంబరులో భారత్‌కు రానున్నాడని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అర్జెంటీనా ఫుట్‌బాల్ సమాఖ్య తాజా ప్రకటనతో అంతకంటే ముందే మెస్సీ భారత్ రావడం ఖాయమైంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి