ISSF World Cup 2025: మేఘనకు కాంస్యం
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:38 AM
భారత షూటర్ మేఘన సజ్జనార్ తన కెరీర్‌లో తొలిసారిగా వరల్డ్‌కప్ పతకం సాధించింది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఆమె కాంస్యం అందుకుంది. శనివారం 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో...
మేఘనకు కాంస్యం
షూటింగ్ వరల్డ్‌కప్
నింగ్బో (చైనా): భారత షూటర్ మేఘన సజ్జనార్ తన కెరీర్‌లో తొలిసారిగా వరల్డ్‌కప్ పతకం సాధించింది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఆమె కాంస్యం అందుకుంది. శనివారం 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో ఇషా సింగ్ స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు పతకాలతో ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్‌కప్ రైఫిల్/పిస్టల్ ఈవెంట్‌లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. గత ఎనిమిదేళ్లలో తొలిసారి వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరిన మేఘన 230 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. అలాగే చైనాకు చెందిన 16 ఏళ్ల షూటర్ పెంగ్ జిన్ 255.3తో వరల్డ్ రికార్డుతో పసిడి పతకం దక్కించుకుంది. ఇక పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో ఫైనల్‌కు చేరిన కిరణ్ అంకుశ్ జాదవ్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఇదే ఈవెంట్‌లో స్వప్నిల్ కుషాలే ఫైనల్ చేరలేకపోయాడు.
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి