Asia Cup Hockey: కొరియాకు మలేసియా ఝలక్
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:42 AM
ఆసియా కప్ హాకీ టోర్నీలో కొరియా టైటిల్ ఆశలకు గట్టి దెబ్బ తగిలింది. శనివారం జరిగిన పూల్ ‘బి’ మ్యాచ్‌లో ఐదుసార్లు చాంపియన్ కొరియాకు 4-1తో మలేసియా ఝలకిచ్చింది...
నేటి మ్యాచ్
భారత్ X జపాన్
మ. 3 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో
ఆసియా కప్ హాకీ
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా కప్ హాకీ టోర్నీలో కొరియా టైటిల్ ఆశలకు గట్టి దెబ్బ తగిలింది. శనివారం జరిగిన పూల్ ‘బి’ మ్యాచ్‌లో ఐదుసార్లు చాంపియన్ కొరియాకు 4-1తో మలేసియా ఝలకిచ్చింది. జియోనియో జిన్ రెండో నిమిషంలోనే గోల్ చేసి కొరియాను ఆధిక్యంలో నిలిపాడు. కానీ తర్వాత అద్భుతంగా పుంజుకొన్న మలేసియా అఖీముల్లా (29, 34, 58) హ్యాట్రిక్‌తోపాటు అఫ్రన్ ఫీల్డ్ గోల్‌తో అనూహ్య విజయం దక్కించుకుంది. పూల్ ‘బి’ మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 8-3తో తైపీని చిత్తు చేసింది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి