Share News

Lionel Messi: మెస్సిని చూడటం కోసం మా హనీమూన్ రద్దు చేసుకున్నాం.. ఓ లేడీ ఫ్యాన్

ABN , Publish Date - Dec 13 , 2025 | 10:36 AM

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి నేడు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అతడు ఇప్పటికే కోల్‌కతా చేరుకున్నాడు. ఓ మహిళా అభిమాని మెస్సిని చూడటం కోసం తన హనీమూన్ రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది.

Lionel Messi: మెస్సిని చూడటం కోసం మా హనీమూన్ రద్దు చేసుకున్నాం.. ఓ లేడీ ఫ్యాన్
Lionel Messi

ఇంటర్నెట్ డెస్క్: భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. అర్జెంటీననా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి ఇండియాలో అడుగుపెట్టాడు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ పేరుతో సాగనున్న ఈ పర్యటనలో భాగంగా.. ఇప్పటికే మెస్సి(Lionel Messi) కోల్‌కతా చేరుకున్నాడు. కోల్‌కతా అంతా ఇప్పుడు అంతా మెస్సి జపమే చేస్తోంది. 2011 తర్వాత ఈ స్టార్ ఆటగాడు ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అభిమానులంతా భారీ ఎత్తున ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు. ఇందులో ఓ లేడీ ఫ్యాన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


‘గత శుక్రవారమే నాకు పెళ్లి అయింది. మెస్సి ఇక్కడికి వస్తున్నాడని తెలిసి.. పట్టరాని సంతోషంలో మునిగిపోయాం. ఈరోజు మా హనీమూన్ షెడ్యూల్ ఉంది. కానీ మెస్సిని చూడటం కోసం మా హనీమూన్ రద్దు చేసుకున్నాం. నేను, నా భర్త మెస్సిని చూడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే ఇక్కడికి వచ్చి దాదాపు రెండు గంటలైంది. మరికొద్ది సేపట్లో మెస్సిని చూడబోతున్నాం. ఇది జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే అవకాశం. హనీమూన్‌కి ఎప్పుడైనా వెళ్లొచ్చు.. అందుకే మెస్సిని చూసే అవకాశాన్ని చేజార్చుకోవాలని అనుకోలేదు’ అని ఓ మహిళ మెస్సిపై తన అభిమానాన్ని వివరించింది.


చాలా మంది అభిమానులు మెస్సిన చూడటం కోసం ఎంతో ఆసక్తిగా, ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఒక్కొక్కరు తమ అభిమానాన్ని ఒక్కో రకంగా వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవీ చదవండి:

జట్టుకి ఇవి మంచి సంకేతాలు కాదు.. ఇర్ఫాన్ పఠాన్

గావస్కర్ వ్యక్తిత్వ హక్కులపై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

Updated Date - Dec 13 , 2025 | 01:38 PM