లక్ష్య సేన్ సంచలనం
ABN , Publish Date - Mar 14 , 2025 | 04:02 AM
ఫెండింగ్ చాంపియన్ జొనాథన్ క్రిస్టీకి షాకిచ్చిన భారత ఏస్ షట్లర్ లక్ష్య సేన్, గాయత్రి జోడీ ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా...
క్వార్టర్స్‌కు గాయత్రి జోడీ
అలవోకగా క్వార్టర్స్‌కు
వైదొలిగిన సాత్విక్ జంట
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్
బర్మింగ్‌హామ్: డిఫెండింగ్ చాంపియన్ జొనాథన్ క్రిస్టీకి షాకిచ్చిన భారత ఏస్ షట్లర్ లక్ష్య సేన్, గాయత్రి జోడీ ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. ఏడో సీడ్ సాత్విక్ సాయిరాజ్ జంట నిష్క్రమించింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో లక్ష్యసేన్ 21-13, 21-10తో వరల్డ్ నెం:2 జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై వరుస గేముల్లో సునాయాసంగా నెగ్గాడు. క్వార్టర్స్‌లో లి షి ఫెంగ్ (చైనా)తో సేన్ తలపడనున్నాడు. తొలి గేమ్ ఆరంభం నుంచే సేన్ ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 4-0తో ముందంజ వేసిన భారత షట్లర్ చివరి వరకు అదే జోరుతో గేమ్‌ను దక్కించుకొన్నాడు. ఇక, రెండో గేమ్ ఆరంభంలో నువ్వానేనా అన్నట్టుగా సాగినా.. ఒక్కసారిగా పుంజుకొన్న సేన్ పదునైన స్మాష్‌లతో మ్యాచ్‌ను ముగించాడు. ఇక మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోడ్ 16-21, 13-21తో అకానె యమ గూచి (జపాన్) చేతిలో ఓడింది.
డబుల్స్ ప్రీక్వార్టర్స్‌లో చైనా జంట జి హో నన్-జంగ్ వి హన్‌తో మ్యాచ్‌లో 16-21, 2-2తో వెనుకంజలో ఉన్న సమయంలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి ద్వయం వైదొలిగింది. చిరాగ్ షెట్టికి వెన్నునొప్పి తిరగబెట్టడంతో మధ్యలోనే భారత జంట రిటైరైంది. ట్రీసా జాలీ-గాయత్రి జోడీ 15-21, 21-18, 21-18తో కొరియాకు చెందిన కిమ్ హై జియాంగ్-కాంగ్ హి యంగ్‌పై గెలిచింది. మిక్స్‌డ్‌లో రోహన్ కపూర్-రుత్విక శివాని ద్వయం 10-21, 12-21తో చైనాకు చెందిన ఫెంగ్ యాన్ జి-వి య జిన్ చేతిలో పరాజయం పాలైంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి