Share News

Hong Kong Open 2025: రన్నర్‌పతో సరి

ABN , Publish Date - Sep 15 , 2025 | 04:34 AM

హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత షట్లర్లు ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డారు. ఆదివారం జరిగిన సింగిల్స్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌, డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి ద్వయం పరాజయం పాలై...

Hong Kong Open 2025: రన్నర్‌పతో సరి

హాంకాంగ్‌ ఓపెన్‌

ఫైనల్లో లక్ష్య, సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ఓటమి

హాంకాంగ్‌: హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత షట్లర్లు ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డారు. ఆదివారం జరిగిన సింగిల్స్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌, డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి ద్వయం పరాజయం పాలై రన్నర్‌పగా నిలిచారు. రెండేళ్లలో తొలిసారి ఓ మేజర్‌ టోర్నీ ఫైనల్‌కు చేరిన లక్ష్య వరల్డ్‌ నెంబర్‌ 4 లి షి ఫెంగ్‌పై 15-21, 12-21 తేడాతో ఓడాడు. తొలి గేమ్‌లో 4-0తో ఆధిపత్యం చూపినా.. ఆ తర్వాత ఫెంగ్‌ జోరు ముందు నిలువలేకపోయాడు. రెండో గేమ్‌లోనూ 4-1తో చక్కటి అవకాశం వచ్చినా మరోసారి పట్టు కోల్పోయాడు. ర్యాలీ, క్రాస్‌ కోర్ట్‌ స్మాష్‌లతో విరుచుకుపడిన ఫెంగ్‌ సులువుగానే మ్యాచ్‌ను పూర్తి చేశాడు. మరోవైపు 16 నెలల తర్వాత ఓ టోర్నీ ఫైనల్‌ ఆడిన సాత్విక్‌-చిరాగ్‌ సైతం చక్కటి అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఒలింపిక్‌ రజతం సాధించిన లియాంగ్‌ వీ కెంగ్‌-వాంగ్‌ చాంగ్‌ (చైనా) ద్వయంతో 61 నిమిషాల పాటు జరిగిన పోరులో 21-19, 14-21, 17-21 తేడాతో భారత్‌ జోడీ ఓటమి పాలైంది. ఉత్కంఠగా సాగిన తొలి గేమ్‌లో ఆధిపత్యం చూపిన సాత్విక్‌-చిరాగ్‌ టైటిల్‌కు చేరువగా వచ్చారు. కానీ కీలక రెండో గేమ్‌లో అదే జోరును చూపడంలో విఫలం కాగా.. నిర్ణాయక చివరి గేమ్‌లోనైతే 2-11తో వెనుకబడ్డారు. ఆ తర్వాత కాస్త పుంజుకున్నా చైనీస్‌ జోడీ పవర్‌ఫుల్‌ స్మాష్‌, సూపర్‌ నెట్‌ గేమ్‌తో చాంపియన్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి..

అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు

నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 04:34 AM