Share News

Archery World Championship 2025: స్వర్ణ పోరుకు జ్యోతి జోడీ

ABN , Publish Date - Sep 07 , 2025 | 04:48 AM

ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను భారత క్రీడాకారులు ఘనంగా ప్రారంభించారు. కాంపౌండ్‌ కేటగిరిలో రెండు విభాగాల్లో ఫైనల్స్‌కు దూసుకెళ్లి రెండు పతకాలు ఖాయం చేశారు...

Archery World Championship 2025: స్వర్ణ పోరుకు జ్యోతి జోడీ

  • ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌

గ్వాంగ్జూ (దక్షిణ కొరియా): ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను భారత క్రీడాకారులు ఘనంగా ప్రారంభించారు. కాంపౌండ్‌ కేటగిరిలో రెండు విభాగాల్లో ఫైనల్స్‌కు దూసుకెళ్లి రెండు పతకాలు ఖాయం చేశారు. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ విభాగంలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ/రిషభ్‌ యాదవ్‌ ద్వయం.. వరుసగా జర్మనీ, ఎల్‌ సాల్వడార్‌, చైనీస్‌ తైపీ జట్లను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరిగే స్వర్ణ పతక పోరులో నెదర్లాండ్స్‌తో జ్యోతి జోడీ తలపడనుంది. ఇక.. రిషభ్‌, అమన్‌ సైనీ, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఫైనల్‌ చేరింది. తొలుత ఆస్ట్రేలియాను, ఆ తర్వాత అమెరికాను చిత్తుచేసిన భారత త్రయం.. సెమీస్‌లో టర్కీని ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఫ్రాన్స్‌తో భారత్‌ తలపడనుంది.

ఇవి కూడా చదవండి..

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కి మోదీ ఫోన్

తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం

For More National News And Telugu News

Updated Date - Sep 07 , 2025 | 04:48 AM