Share News

Jasprit Bumrah: ఆ ఫుడ్ కోసం కొట్టుకునే వాళ్లం.. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న బుమ్రా

ABN , Publish Date - Aug 12 , 2025 | 01:20 PM

భారత యార్కర్ కింగ్‌ జస్ప్రీత్ బుమ్రా ఈసారి తన ఆటతోనే కాదు, ఫుడ్‌ గేమ్‌‎తో కూడా వార్తల్లో నిలిచాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో Snack Wars అనే ఆసక్తికర సెగ్మెంట్‌లో పాల్గొన్న బుమ్రా, ఇండియా వర్సెస్ యూకే స్నాక్స్‌ గురించి కీలక విషయాలను ప్రస్తావించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Jasprit Bumrah: ఆ ఫుడ్ కోసం కొట్టుకునే వాళ్లం.. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న  బుమ్రా
Jasprit Bumrah Snack Wars

భారత క్రికెట్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఓ యూట్యూబ్ ఛానల్‌లో స్నాక్ వార్స్ అనే సెగ్మెంట్‌లో బుమ్రా.. ఇండియా, యూకే స్నాక్స్‌ని టేస్ట్ చేసి, వాటిలో ఒక దాన్ని విన్నర్‌గా ఎంచుకున్నాడు. ఈ సందర్బంగా బుమ్రా తన బాల్య జ్ఞాపకాలు, ఫుడ్ గురించి కీలక విషయాలను పంచుకున్నాడు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.


మొదటి రౌండ్‌లో UK నుంచి స్కాంపి ఫ్రైస్, ఇండియా నుంచి భుజియా వచ్చాయి. బుమ్రా ముందు స్కాంపి ఫ్రైస్ టేస్ట్ చేశాడు. వెరీ నైస్. ఇది క్రీమ్ అండ్ ఆనియన్ లాగా ఉంది కదా? ఫిష్ ఫ్లేవర్ అని తెలుసు, కానీ ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నాడు. తర్వాత భుజియా ప్యాకెట్ ఓపెన్ చేస్తూ నా సిస్టర్‌తో కలిసి చిన్నప్పుడు బోలెడు తిన్నాం. దీని కోసం ఫైట్ చేసుకునే వాళ్లమని నవ్వుతూ చెప్పాడు. రెండూ టేస్ట్ చేసిన తర్వాత, నాస్టాల్జియాతో వెళ్లాలా, కొత్త రుచితో వెళ్లాలా అని ఆలోచించాడు. చివరకు స్కాంపి ఫ్రైస్‌ని ఎంచుకున్నాడు. ఎందుకంటే అవి అతనికి కొత్తగా, ఫ్రెష్‌గా అనిపించాయి.


మరో రౌండ్‌లో సమోసా vs బేక్డ్ చీజ్ అండ్ ఆనియన్ పఫ్. సమోసా చూడగానే బుమ్రా కళ్లు మెరిశాయి. మా అమ్మ దీన్ని స్పెషల్ ట్రీట్‌గా ఇచ్చేది. సమోసా కోసం సైకిల్ తొక్కుకుంటూ దగ్గర్లోని షాప్‌కి వెళ్లి, ఫ్యామిలీ కోసం తెచ్చేవాడిని. ఈ స్నాక్‌తో నాకు బోలెడు బాల్య జ్ఞాపకాలు ఉన్నాయని ఎమోషనల్‌గా చెప్పాడు. చీజ్ అండ్ ఆనియన్ పఫ్ టేస్ట్ చేసి, బాగుందని అన్నాడు కానీ, సమోసా గెలిచింది.

ఇంకా ఈ సెగ్మెంట్‌లో బుమ్రా పికిల్డ్ వాల్‌నట్స్ vs పకోడీ, ఫిష్ & చిప్స్ vs చికెన్ బిర్యానీ, ట్విగ్‌లెట్స్ vs చక్లీ లాంటి ఆసక్తికర వంటకాలను టేస్ట్ చేశాడు. ఆ క్రమంలో బుమ్రా తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ స్నాక్స్‌ని రుచి చూస్తూ, తన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నాడు. అయితే మీ ఫేవరెట్ స్నాక్ ఏంటో, దానితో మీ జ్ఞాపకాలు ఏంటో కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.


ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 12 , 2025 | 01:55 PM