Bumrah yorker: బుమ్రా సూపర్ యార్కర్.. యూఏఈ బ్యాటర్ ఎలా షాకయ్యాడో చూడండి..
ABN , Publish Date - Sep 11 , 2025 | 07:15 AM
అనుకున్నట్టుగానే టీమిండియా ఆసియా కప్‌లో తన ప్రతాపం చూపించింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించి సత్తా చాటింది. యూఏఈ నిర్దేశించిన లక్ష్యాన్ని ఐదు ఓవర్ల లోపే ఛేదించింది.
అనుకున్నట్టుగానే టీమిండియా ఆసియా కప్ (Asia Cup 2025)లో తన ప్రతాపం చూపించింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించి సత్తా చాటింది. యూఏఈ నిర్దేశించిన లక్ష్యాన్ని ఐదు ఓవర్ల లోపే ఛేదించింది. ఇంగ్లండ్ పర్యటనలో పూర్తి మ్యాచ్‌లు ఆడలేకపోయిన జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్‌లో అదరగొట్టాడు. తన వేగవంతమైన యార్కర్లతో యూఏఈ బ్యాటర్లను బెంబేలెత్తించాడు (India vs UAE 2025).
ఆసియా కప్ 2025లో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10 బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో యూఏఈతో తలపడింది. బుమ్రా తొలి 10 బంతుల్లోనే టీం ఇండియా తరపున తొలి వికెట్ తీసుకున్నాడు. అద్భుతమైన యార్కర్‌తో బోణీ చేశాడు (Bumrah yorker). బుమ్రా వేసిన యార్కర్‌కు యూఏఈ ఓపెనర్ అలీషాన్ షరాఫు షాకయ్యాడు. అతడు బ్యాట్ పెట్టే లోపు ఆఫ్ వికెట్ పడిపోయింది.
2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత బుమ్రా టీమిండియా తరఫున ఆడిన తొలి అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ఇదే (IND vs UAE highlights). కాగా, బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ టోర్నీలో భాగంగా తమ తర్వాతి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆదివారం ఆడబోతోంది. ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేక్‌ల్లా అమ్ముడుపోయాయి.
ఇవి కూడా చదవండి
నిఖత్‌కు నిరాశ క్వార్టర్స్‌లో ఓటమి
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి