India Women Hockey: అమ్మాయిలు అదే జోరు
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:50 AM
మహిళల ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. టోర్నీలో ఒక్క ఓటమి కూడా కూడా లేకుండా గ్రూప్ దశను టాపర్‌గా ముగించిన మన అమ్మాయిల బృందం...
సూపర్-4లో కొరియాపై భారత్ గెలుపు
ఆసియా కప్ హాకీ
హాంగ్జౌ (చైనా): మహిళల ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. టోర్నీలో ఒక్క ఓటమి కూడా కూడా లేకుండా గ్రూప్ దశను టాపర్‌గా ముగించిన మన అమ్మాయిల బృందం.. సూపర్-4లోనూ అంతేదీటుగా విజృంభిస్తోంది. బుధవారం జరిగిన సూపర్-4 తొలి పోరులో భారత్ 4-2తో కొరియాను చిత్తు చేసింది. భారత జట్టులో వైష్ణవి (2వ), సంగీతా కుమారి (33వ), లాల్‌రెమ్సియామి (40వ), రుతుజ (59వ) తలో గోల్ సాధించారు. కొరియా తరఫున యుజిన్ కిమ్ (33వ, 53వ) రెండు గోల్స్ చేసింది. భారత్ తమ రెండో మ్యాచ్‌ను గురువారం చైనాతో ఆడనుంది. నాలుగు జట్లు తలపడే సూపర్-4లో తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ చేరతాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి