Share News

World Boxing Championships 2025: నిఖత్‌కు నిరాశ క్వార్టర్స్‌లో ఓటమి

ABN , Publish Date - Sep 11 , 2025 | 04:48 AM

లంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మూడో పతకం మిస్సయింది. డబుల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ పోరాటం ఈసారి క్వార్టర్‌ఫైనల్‌కే....

World Boxing Championships 2025: నిఖత్‌కు నిరాశ క్వార్టర్స్‌లో ఓటమి

సెమీఫైనల్‌కు నూపుర్‌, జాస్మిన్‌

భారత్‌కు రెండు పతకాలు ఖరారు

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌

లివర్‌పూల్‌ (ఇంగ్లండ్‌): తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మూడో పతకం మిస్సయింది. డబుల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ పోరాటం ఈసారి క్వార్టర్‌ఫైనల్‌కే పరిమితమైంది. గతసారి (2023) 50 కిలోలు, అంతకుముందు (2022) 52 కిలోల విభాగాలలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నిఖత్‌ ఈసారి 51 కిలోల బరిలో దిగింది. అయితే బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో జరీన్‌ 0-5తో రెండుసార్లు ఒలింపిక్‌ రజత పతక విజేత బ్యూస్‌ నాజ్‌ కకిరోగ్లు (తుర్కియే) చేతిలో చిత్తయింది. దాంతో టోర్నీ నుంచి నిఖత్‌ రిక్తహస్తాలతో వెనుదిరిగింది. అయితే, నిఖత్‌ నిరాశపరిచినా.. హరియాణా బాక్సర్లు నూపుర్‌ షెరాన్‌, జాస్మిన్‌ లంబోరియా తమ విభాగాల్లో సత్తా చాటి భారత్‌కు రెండు పతకాలు ఖాయం చేశారు. మహిళల 80+ కేజీల విభాగంలో నూపుర్‌, 57 కిలోల కేటగిరిలో జాస్మిన్‌ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. దిగ్గజ బాక్సర్‌ హవా సింగ్‌ మనుమరాలైన 26 ఏళ్ల నూపుర్‌ క్వార్టర్‌ఫైనల్లో 4-1తో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఒల్టినోయ్‌ సొతింబేవను చిత్తు చేసింది. మరో క్వార్టర్స్‌ బౌట్‌లో జాస్మిన్‌ 5-0తో ఉజ్భెకిస్థాన్‌ బాక్సర్‌ ఖుమోరాబోను మమజొనొవాటపై గెలిచింది. సెమీఫైనల్స్‌లో ఓడినా వీళ్లకు కాంస్య పతకాలు దక్కుతాయి. ఇక..పురుషుల కేటగిరీలో జాదుమని సింగ్‌ (48 కి), అభినాష్‌ జమ్వాల్‌ (65 కి) క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టి పతకానికి ఒక్క విజయం దూరంలో నిలిచారు. కాగా, మరో భారత బాక్సర్‌ జుగ్నూ అహ్లావత్‌ (85 కి) తొలి రౌండ్‌ పరాజయంతో టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించాడు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 11 , 2025 | 04:48 AM