MS Dhoni World Cup: టీమిండియాకు ధోనీ సేవలు.. బీసీసీఐ ప్రతిపాదనకు అంగీకరిస్తాడా?
ABN , Publish Date - Aug 30 , 2025 | 04:55 PM
ఎంఎస్ ధోనీ.. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన గొప్ప కెప్టెన్. ధోనీ సారథ్యంలో టీమిండియా రెండు ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఇక, ఐపీఎల‌్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.
ఎంఎస్ ధోనీ (MS Dhoni).. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన గొప్ప కెప్టెన్. ధోనీ సారథ్యంలో టీమిండియా రెండు ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఇక, ఐపీఎల‌్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ను ధోనీ ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. వ్యూహాలను రచించడంలోనూ, వాటిని అమలు చేయడంలోనూ ధోనీని మించిన వారు లేరని ఇప్పటికీ చాలా మంది భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో ధోనీ సేవలను వాడుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం (MS Dhoni BCCI mentorship).
ధోనీని 2021 ప్రపంచకప్ సమయంలో టీమిండియా మెంటర్‌గా బీసీసీఐ నియమించింది. ఆ టోర్నీ అయిపోగానే ధోనీ తన బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత తిరిగి అతడికి ఎలాంటి బాధ్యతలనూ బీసీసీఐ అప్పగించలేదు. అయితే ఇకపై ధోనీ సేవలను సుదీర్ఘంగా వాడుకునేందుకు బీసీసీఐ రెడీ అవుతున్నట్టు సమాచారం. టీమిండియాకు పూర్తి స్థాయి మెంటార్‌గా ధోనీని నియమించేందుకు బీసీసీఐ రెడీ అవుతోందట. అయితే బీసీసీఐ ప్రతిపాదనను ధోనీ అంగీకరిస్తాడో, లేదో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా హెడ్‌కోచ్ అయిన గంభీర్‌తో ధోనీకి విభేదాలున్నాయని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి (Dhoni cricket expertise).
ధోనీ సారథ్యంలో టీమిండియా గెలిచిన రెండు ప్రపంచకప్ జట్లలోనూ గంభీర్ కీలక పాత్ర పోషించాడు (MS Dhoni leadership). 2011 ప్రపంచకప్ గెలుపు క్రెడిట్‌ను పూర్తిగా ధోనీకే ఇవ్వడంపై గంభీర్ పలుసార్లు అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు మొత్తం కలిసికట్టుగా ఆడినందుకే ప్రపంచకప్ గెలిచామని, క్రెడిట్ అంతా కెప్టెన్‌కే ఇవ్వడం సరికాదని గంభీర్ అన్నాడు. ఈ నేపథ్యంలో తనకంటే పై హోదాలో ధోనీని నియమిస్తే గంభీర్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
హర్భజన్ సింగ్ శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించిన ఘటన.. పాత వీడియోను షేర్ చేసిన లలిత్ మోదీ
బీసీసీఐలో కీలక మార్పులు.. కొత్త అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి