Women Hockey Asia Cup 2025: అయ్యో అమ్మాయిలు
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:24 AM
ఆసియా కప్ రూపంలో ప్రపంచ కప్‌నకు నేరుగా అర్హత సాధించే అద్భుత అవకాశాన్ని భారత హాకీ అమ్మాయిలు చేజార్చుకున్నారు. ఆసియా కప్‌లో ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరచి...
ఆసియా కప్ హాకీ
ఫైనల్లో చైనా చేతిలో ఓడిన భారత్
ప్రపంచ కప్ బెర్త్ మిస్
హాంగ్జౌ (చైనా): ఆసియా కప్ రూపంలో ప్రపంచ కప్‌నకు నేరుగా అర్హత సాధించే అద్భుత అవకాశాన్ని భారత హాకీ అమ్మాయిలు చేజార్చుకున్నారు. ఆసియా కప్‌లో ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరచి టైటిల్‌పై ఆశలు కల్పించిన మనోళ్లు.. తుది మెట్టుపై బోల్తా పడ్డారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో భారత్ 1-4తో ఆతిథ్య చైనా చేతిలో పరాజయంపాలై రన్నర్‌పతో సరిపెట్టుకుంది. భారత క్రీడాకారిణి నవ్‌నీత్ కౌర్ మ్యాచ్ మొదలైన నిమిషానికే పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచింది. చైనా తరఫున జిగ్జియా వూ (21వ నిమిషంలో), హోంగ్ లి (41వ), మీరోంగ్ జూ (51వ), జియాకి జోంగ్ (53వ) తలో గోల్ సాధించి జట్టును చాంపియన్‌గా నిలిపారు. టైటిల్ నెగ్గడంతో చైనా.. వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ వేదికలుగా జరిగే ప్రపంచ కప్‌లో నేరుగా పోటీపడనుంది. చైనాకు ఇది మూడో ఆసియా కప్ టైటిల్. గతంలో 1989, 2009లో చైనా చాంపియన్‌గా నిలిచింది.
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి