IND VS WI 2nd Test: ముగిసిన మూడో రోజు ఆట..విండీస్ స్కోర్ ఎంతంటే?
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:52 PM
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్లు కాస్త పుంజుకున్నారు. జట్టును ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించేందుకు పోరాడుతున్నారు.
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్లు కాస్త పుంజుకున్నారు. జట్టును ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించేందుకు పోరాడుతున్నారు. నాలుగో రోజు కూడా భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఎక్కువసేపు క్రీజులో నిలిస్తే భారత్(India) కు కొంత లక్ష్యాన్ని నిర్దేశించే ఛాన్స్ ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 140/4తో మూడో రోజు ఆటను కొనసాగించిన విండీస్(West Indies) జట్టు.. కుల్‌దీప్ యాదవ్ (5/82) మాయాజాలంకు కుదేలై 248 పరుగులకు ఆలౌటైంది. దీంతో 270 పరుగులు వెనుకబడి ‘ఫాలో ఆన్’ నుంచి తప్పించుకోలేక పోయింది. చందర్‌పాల్ (10), అథనాజ్ (7) మరోసారి విఫలమవడంతో వెస్టిండీస్ ఫాలో ఆన్‌లోనూ ప్రారంభంలో 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
దీంతో విండీస్(West Indies) జట్టు మరోసారి కుప్పకూలి మూడో రోజే మ్యాచ్ ముగుస్తుందేమోనని క్రీడ పండితులతో సహా అందరూ భావించారు. కానీ, జాన్ కాంప్‌బెల్ (87*), షైయ్ హోప్ (66*) పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. భారత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. దీంతో కరేబియన్ జట్టు 173/2 స్కోర్ వద్ద మూడో రోజు ఆట ముగిసింది. దీంతో విండీస్ ఇంకా 97 పరుగుల వెనుకంజలో ఉంది. కాంప్‌బెల్, షైయ్ హోప్ అభేద్యమైన మూడో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ జంటను విడదీయడానికి భారత బౌలర్లు(Indian Bowlers) ఎంతగానో శ్రమించినా ఫలితం లేకపోయింది. కాంప్‌బెల్ 69 బంతుల్లో, హోప్ 80 బంతుల్లో అర్ధ శతకాలు అందుకున్నారు. విండీస్ ఫాల్ ఆన్ లో భారత్ బౌలర్లు సిరాజ్(Siraj), వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 518/5 వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
Brian Lara request to Jaiswal: 'ప్లీజ్.. మా బౌలర్లను అంతలా బాదకు'..జైస్వాల్‌కు లారా రిక్వెస్ట్!
Pakistan Bowler Challenge To Abhishek: అభిషేక్ శర్మకు పాక్ పేసర్ సంచలన సవాల్!
India Dominates West Indies: అటు బ్యాట్‌తో.. ఇటు బంతితో