Share News

Kuldeep Yadav: ఢిల్లీ టెస్టులో కుల్దీప్ మాయాజాలం..64 ఏళ్ల ప్రపంచ రికార్డు సమం

ABN , Publish Date - Oct 12 , 2025 | 04:05 PM

కరేబియన్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ 26.5 ఓవర్లలో 82 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో కుల్దీప్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధికంగా ఐదు వికెట్ల హాల్ సాధించిన ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా 64 ఏళ్ల రికార్డును సమం చేశాడు.

Kuldeep Yadav: ఢిల్లీ టెస్టులో కుల్దీప్ మాయాజాలం..64 ఏళ్ల ప్రపంచ రికార్డు సమం

వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శనతో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల హాల్ సాధించి కుల్దీప్ 64 ఏళ్ల ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో అదరగొడుతున్నారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ మాయాజాలం ముందు వెస్టిండీస్ బ్యాటర్లు నిలవలేకపోయారు. అయితే కుల్దీప్ యాదవ్ సమం చేసిన ఆ వరల్డ్ రికార్డు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


కరేబియన్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)26.5 ఓవర్లలో 82 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇది అతడి టెస్ట్ కెరీర్‌లో 5వసారి ఫైపర్(5వికెట్లు) కావడం విశేషం. ఈ ప్రదర్శనతో కుల్దీప్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధికంగా ఐదు వికెట్ల హాల్(Kuldeep 5 wickets) సాధించిన ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా 64 ఏళ్ల రికార్డును సమం చేశాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లాండ్(England) మాజీ స్పిన్నర్ జానీ వార్డ్‌లే పేరిట ఉంది. అతను 28 టెస్ట్ మ్యాచ్‌లలో ఐదు సార్లు ఐదు వికెట్లు తీశాడు. కానీ కుల్దీప్ యాదవ్ కేవలం మాత్రం 15 టెస్ట్ మ్యాచ్‌లలోనే ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం.


జానీ వార్డ్‌లే 1964లో ఈ రికార్డును నెలకొల్పగా.. తాజాగా కుల్దీప్ యాదవ్(Kuldeep 5 wickets) దానిని సమం చేశాడు. తన బౌలింగ్‌ను మెరుగుపరుచుకుంటూ కుల్దీప్ ఈ రికార్డును త్వరలోనే బద్దలు కొడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ప్రపంచ రికార్డుతో పాటు కుల్దీప్ మరికొన్ని ఘనతలు కూడా సాధించాడు. వెస్టిండీస్(West Indies) బ్యాటర్ షాయ్ హోప్‌ను వన్డేలు , టెస్టుల్లో 3 సార్లు ఔట్ చేసిన ప్రపంచంలోనే ఏకైక బౌలర్‌గా నిలిచాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్(India) తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా టాప్ ప్లేసుకు చేరుకున్నాడు. ఇప్పటివరకు నంబర్-1 స్థానంలో వరుణ్ చక్రవర్తి ఉన్నాడు.



ఇవి కూడా చదవండి

Brian Lara request to Jaiswal: 'ప్లీజ్.. మా బౌలర్లను అంతలా బాదకు'..జైస్వాల్‌కు లారా రిక్వెస్ట్!

Pakistan Bowler Challenge To Abhishek: అభిషేక్ శర్మకు పాక్ పేసర్ సంచలన సవాల్!

India Dominates West Indies: అటు బ్యాట్‌తో.. ఇటు బంతితో

Updated Date - Oct 12 , 2025 | 04:05 PM