Brian Lara request to Jaiswal: 'ప్లీజ్.. మా బౌలర్లను అంతలా బాదకు'..జైస్వాల్‌కు లారా రిక్వెస్ట్!
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:24 PM
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత మైదానంలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. కరేబియన్ జట్టు క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా నేరుగా యశస్వి జైస్వాల్ వద్దకు వెళ్లి.. అతని ప్రశంసించాడు.
టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ తన అదిరిపోయే బ్యాటింగ్ తో వరల్డ్ వైడ్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. కరేబియన్ జట్టైన వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 175 పరుగులతో చెలరేగిపోయాడు. తొలి రోజే 150 పరుగులు చేశాడు అంటే.. విండీస్ బౌలర్లను ఏ రేంజ్ లో బాదాడో అర్ధం చేసుకోవచ్చు. ఇక జైస్వాల్ బ్యాటింగ్ చూసిన ప్రపంచ దిగ్గజం బ్రియాన్ లారా సైతం ఫిదా అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ అనంతరం లారా..జైస్వాల్ ను కలిశాడు. అంతేకాక అతడికి సరదాగా ఓ స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేశాడు. లారా చేసిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి..ఆ వివరాలు ఏమిటో చూద్దాం..
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్(IND VS WI) మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత మైదానంలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. కరేబియన్ జట్టు క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా నేరుగా యశస్వి జైస్వాల్(Brian Lara request to Jaiswal) వద్దకు వెళ్లి.. అతని ప్రశంసించాడు. ఆ తర్వాత నవ్వుతూ..' మా బౌలర్లను అంత దారుణంగా కొట్టొద్దు' అని సరదాగా స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. లారా వంటి లెజెండ్ నుంచి వచ్చిన ఈ ప్రశంసకు, సరదా వ్యాఖ్యకు జైస్వాల్ కూడా నవ్వుతూ రిప్లయ్ ఇచ్చాడు. ఈ అందమైన క్షణాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్(Instagram) అకౌంట్ లో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది
ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ ఆడిన తీరుకు వెస్టిండీస్ బౌలర్లకు(West Indies Bowlers) కన్నీరు వచ్చేలా చేసిందనే ఆశ్చర్యం అక్కర్లేదు. కేవలం 175 పరుగుల వద్ద దురదృష్టవశాత్తు రనౌట్ అవ్వడంతో విండీస్ బౌలర్లు బ్రతిపోయారు. లేకపోతే స్కోరు మరింత భారీగా ఉండేది. అలానే జైస్వాల్(Jaiswal) తన మూడో డబుల్ సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. శుభ్‌మన్ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా 92వ ఓవర్లో జైస్వాల్ తన వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి
Pakistan Bowler Challenge To Abhishek: అభిషేక్ శర్మకు పాక్ పేసర్ సంచలన సవాల్!
India Dominates West Indies: అటు బ్యాట్‌తో.. ఇటు బంతితో