World Cup 2025 Final: అదరగొట్టిన బ్యాటర్లు.. ఫైనల్లో భారత్ భారీ స్కోర్
ABN , Publish Date - Nov 02 , 2025 | 08:34 PM
మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేశారు.
క్రీడా వార్తలు: మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో ప్రోటీస్ జట్టు ముందు 299 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. భారత్ బ్యాటర్లలో షఫాలీ వర్మ( 87) సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకు పడింది. తర్వాత దీప్తిశర్మ 58, స్మృతి మంధాన 45 , రిచా ఘోష్ 34 పరుగులు చేశారు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో అయోబొంగా ఖాకా 3 వికెట్లు పడగొట్టింది. మ్లాబా, డి క్లెర్క్ , క్లో ట్రయాన్ తలో వికెట్ తీశారు.
ఈ ఫైనల్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీవ్ర నిరాశపరిచింది. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన హర్మన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీప్తి శర్మతో కలిసి కాసేపు క్రీజులో నిలబడినప్పటికి తన మార్క్ చూపించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. 29 బంతుల్లో కేవలం 20 పరుగులు చేసిన హర్మన్.. సౌతాఫ్రికా స్పిన్నర్ మలాబా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. అయితే ఈ మ్యాచ్‌లో హర్మన్ విఫలమైనప్పటికి ఓ వరల్డ్ రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. మహిళల ప్రపంచ కప్ నాకౌట్‌లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. వరల్డ్‌కప్‌లో నాలుగు నాకౌట్ మ్యాచ్‌లు ఆడిన హర్మన్.. 331 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ పేరిట(330) ఉండేది.
ఇవి కూడా చదవండి..
అంతర్జాతీయ టీ20లకు విలియమ్సన్ వీడ్కోలు
IND vs AUS 3rd T20: వాషింగ్టన్ సుందర్ విధ్వంసం.. మూడో టీ20లో భారత్ గెలుపు
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..