Smriti Mandhana Creates Record: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
ABN , Publish Date - Nov 02 , 2025 | 07:52 PM
మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ గా ఆమె నిలిచింది.
క్రీడా వార్తలు: మహిళల ప్రపంచ కప్ 2025(Women's World Cup) ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ గా ఆమె చరిత్ర సృష్టించింది. నేడు(ఆదివారం) సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో (India vs South Africa) మంధాన ఈ అరుదైన ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డు మిథాలి రాజ్(Mithali Raj) పేరిట ఉండేది. మిథాలీ 2017 ఎడిషన్‌లో 409 పరుగులు చేయగా.. 2025 ఎడిషన్‌లో స్మృతి 418 పరుగులతో టాప్ ప్లేస్ లో ఉంది.
మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా, భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (45), షఫాలీ వర్మ (87) వేగంగా పరుగులు సాధించారు. దూకుడుగా ఆడిన స్మృతి(Smriti Mandhana) తృటిలో అర్ధ సెంచరీ మిస్ చేసుకుంది. 45 పరుగుల వద్ద.. క్లో ట్రయాన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ సినాలో జాఫ్తాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఇక సెమీ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శనతో ఓవర్ నైట్ స్టార్ అయినా జెమీమా(Jemimah Rodrigues).. ఈ మ్యాచ్‌లో తక్కువ పరుగుల(24)కే ఔటైంది. దూకుడుగా కనిపించిన షెఫాలీ వర్మ 87 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అయోబొంగా ఖాకా బౌలింగ్ లో ఔటైంది. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా 20 పరుగులకే పెవిలియన్ చేరింది. మొత్తంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి..
అంతర్జాతీయ టీ20లకు విలియమ్సన్ వీడ్కోలు
IND vs AUS 3rd T20: వాషింగ్టన్ సుందర్ విధ్వంసం.. మూడో టీ20లో భారత్ గెలుపు
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..