India vs Pakistan Match Live Updates: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్
ABN , First Publish Date - Feb 23 , 2025 | 09:55 AM
ICC Champions Trophy 2025 IND vs Pak: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. 50 ఓవర్లు పూర్తిగా ఆడకుండానే పాకిస్తాన్ ఆలౌట్ అయింది. 49.4 ఓవర్లకు పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. 242 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్ చేయబోతుంది.
Live News & Update
-
Feb 23, 2025 21:44 IST
ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌ను ఓడించిన భారత్
ఛాంపియన్స్ ట్రోపీలో భారత్ రెండో విజయం
బంగ్లాదేశ్‌పై మొదటి విజయం తర్వాత పాక్‌పై వరుసగా రెండో విజయం
242 పరుగుల విజయలక్ష్యాన్ని సులభంగా ఛేదించిన భారత్
కోహ్లీ సెంచరీ
111 బంతుల్లో వంద పరుగులు కొట్టిన కోహ్లీ
వరుసగా రెండు మ్యాచ్ ఓడిన పాకిస్తాన్
మెరుగ్గా భారత్ సెమీస్ అవకాశాలు
నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన భారత్
-
Feb 23, 2025 21:32 IST
మూడో వికెట్ కోల్పోయిన భారత్
మూడో వికెట్ కోల్పోయిన భారత్
39వ ఓవర్‌లో శ్రేయాస్ అయ్యర్
56 పరుగుల వద్ద అయ్యర్ అవుట్
-
Feb 23, 2025 21:13 IST
35 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్
35 ఓవర్లకు భారత్ స్కోర్ 189/2
విరాట్ కోహ్లీ 71 (నాటౌట్)
శ్రేయస్ అయ్యర్ 48 (నాటౌట్)
విజయం దిశగా భారత్
నిలకడగా ఆడుతున్న కోహ్లీ, శ్రేయస్ అయ్యర్
ఆఫ్ సెంచరీ చేసిన అయ్యర్
-
Feb 23, 2025 20:54 IST
30 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్
30 ఓవర్లకు భారత్ స్కోర్ 160/2
విరాట్ కోహ్లీ 64 (నాటౌట్)
శ్రేయస్ అయ్యర్ 27 (నాటౌట్)
విజయం దిశగా భారత్
నిలకడగా ఆడుతున్న కోహ్లీ, శ్రేయస్ అయ్యర్
-
Feb 23, 2025 20:39 IST
విరాట్ కోహ్లీ ఆఫ్ సెంచరీ
ఆఫ్ సెంచరీ పూర్తిచేసిన విరాట్ కోహ్లీ
62 బంతుల్లో 51 పరుగులు చేసిన కోహ్లీ
47 పరుగుల వద్ద ఫోర్ కొట్టి అర్థశతకం పూర్తిచేసిన కోహ్లీ
-
Feb 23, 2025 20:35 IST
25 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్
25 ఓవర్లకు భారత్ స్కోర్ 126/2
విరాట్ కోహ్లీ 46 (నాటౌట్)
శ్రేయస్ అయ్యర్ 11 (నాటౌట్)
విజయం దిశగా భారత్
నిలకడగా ఆడుతున్న కోహ్లీ
-
Feb 23, 2025 20:20 IST
20 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్
20 ఓవర్లకు భారత్ స్కోర్ 109/2
విరాట్ కోహ్లీ 36 (నాటౌట్)
శ్రేయస్ అయ్యర్ 4 (నాటౌట్)
100 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన భారత్
46 పరుగుల వద్ద పెవిలియన్ చేరిన గిల్
-
Feb 23, 2025 20:11 IST
రెండో వికెట్ కోల్పోయిన భారత్
రెండో వికెట్ కోల్పోయిన భారత్
శుభమన్ గిల్ 46 (అవుట్)
భారత్ స్కోర్ 100 వద్ద రెండో వికెట్
అహ్మద్ బౌలింగ్‌లో గిల్ క్లీన్‌బౌల్డ్
-
Feb 23, 2025 19:59 IST
16 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్
16 ఓవర్లకు భారత్ స్కోర్ 93/1
విరాట్ కోహ్లీ 27 (నాటౌట్)
శుభమన్ గిల్ 43 (నాటౌట్)
31 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత్
నిలకడగా ఆడుతున్న గిల్, కోహ్లీ
ఆఫ్ సెంచరికీ చేరువలో గిల్
-
Feb 23, 2025 19:59 IST
ఆ ఇద్దరు బౌలర్లను చితక్కొడుతున్న భారత్ బ్యాటర్లు
పాక్ ఫాస్ట్ బౌలర్లు షహీన్ ఆఫ్రిదీ,
హరీస్ రవూఫ్‌ల బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు
ఐదు ఓవర్లు బౌలింగ్ చేసి 43 పరుగులిచ్చిన ఆఫ్రిదీ
రెండు ఓవర్లలో 17 పరుగులిచ్చిన హరీస్ రవూఫ్
-
Feb 23, 2025 19:37 IST
10 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్
10 ఓవర్లకు భారత్ స్కోర్ 64/1
విరాట్ కోహ్లీ 6 (నాటౌట్)
శుభమన్ గిల్ 35 (నాటౌట్)
31 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత్
నిలకడగా ఆడుతున్న గిల్, కోహ్లీ
-
Feb 23, 2025 19:14 IST
5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్
5 ఓవర్లకు భారత్ స్కోర్ 31/1
రోహిత్ శర్మ 20 (అవుట్)
శుభమన్ గిల్ 10 (నాటౌట్)
31 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత్
బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీ
-
Feb 23, 2025 19:10 IST
భారత్ బ్యాటింగ్ ప్రారంభం
బ్యాటింగ్ మొదలెట్టిన భారత్
4 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 26/0
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్
రెండో ఓవర్‌లో పది పరుగులు
మూడో ఓవర్‌లో ఎనిమిది పరుగులు
నాలుగో ఓవర్‌లో ఆరు పరుగులు
-
Feb 23, 2025 18:23 IST
ముగిసిన ఫస్ట్ ఇన్నింగ్స్
49.4 ఓవర్లకు పాకిస్తాన్ ఆలౌట్
241 పరుగులకు పాకిస్తాన్ ఆలౌట్
భారత్ విజయలక్ష్యం 242 పరుగులు
భారత్ బౌలర్ల ధాటికి 50 ఓవర్లు పూర్తిగా ఆడని పాకిస్తాన్
మూడు వికెట్లతో సత్తా చాటిన కుల్దీప్ యాదవ్
రెండు వికెట్లు తీసిన హర్థిక్ పాండ్యా
చెరో వికెట్ తీసిన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా
స్పిన్నర్లకు సహకరించిన పిచ్
పొదుపుగా బౌలింగ్ చేసిన భారత్
పొదుపు బౌలింగ్‌తో 250 దాటని పాకిస్తాన్ స్కోర్
కొద్దిసేపు విరామం తర్వాత మొదలుకానున్న భారత్ బ్యాటింగ్
-
Feb 23, 2025 18:08 IST
పాకిస్తాన్ ఎనిమిదో వికెట్ డౌన్
ఎనిమిది వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్
47వ ఓవర్‌లో ఎనిమిదో వికెట్ డౌన్
47.4 ఓవర్ల వద్ద పాక్ బ్యాటర్ నషీమ్ షాను అవుట్ చేసిన కుల్దీప్
మొత్తం మూడు వికెట్లు తీసుకున్న కుల్దీప్ యాదవ్
47 ఓవర్లు పూర్తయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 222/8
-
Feb 23, 2025 18:00 IST
45 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ స్కోర్
45 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 212/7
రాణించిన భారత బౌలర్లు
మొదటి నుంచి పాక్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేసిన భారత బౌలర్లు
వరుస వికెట్లతో సత్తా
రెండేసి వికెట్లు తీసుకున్న కుల్దీప్ యాదవ్, హర్థిక్ పాండ్యా, చెరో వికెట్ తీసిన రవీంద్ర జడేజా, అక్షర పటేల్
పొదుపుగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు
-
Feb 23, 2025 17:48 IST
ఏడో వికెట్ డౌన్
వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్
43వ ఓవర్‌లో వరుస వికెట్లు
42.4, 42,5 ఓవర్ల వద్ద వికెట్స్ కోల్పోయిన పాకిస్తాన్
వరుసగా రెండు వికెట్లు తీసుకున్న కుల్దీప్ యాదవ్
-
Feb 23, 2025 17:35 IST
40 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్
40 ఓవర్లు పూర్తయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 183/5
మిగిలిన మరో పది ఓవర్లు
250 నుంచి 260 పరుగులు చేసే ఛాన్స్
కీలక బ్యాట్స్‌మెన్స్ అవుట్
బ్యాటింగ్ చేస్తున్న సల్మన్, షా
-
Feb 23, 2025 17:24 IST
ఐదో వికెట్ డౌన్
ఐదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
36.1 ఓవర్లకు పాక్ స్కోర్ 165/5
34వ ఓవర్‌లో రిజ్వాన్ వికెట్ తీసుకున్న అక్షర్ పటేల్
35వ ఓవర్‌లో వికెట్ తీసిన పాండ్యా
37వ ఓవర్‌లో వికెట్ తీసిన రవీంద్ర జడేజా
-
Feb 23, 2025 17:20 IST
నాలుగో వికెట్ డౌన్
నాలుగో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
35 ఓవర్లకు పాక్ స్కోర్ 160/4
వరుస ఓవర్లలో వికెట్లు
34వ ఓవర్‌లో రిజ్వాన్ వికెట్ తీసుకున్న అక్షర్ పటేల్
35వ ఓవర్‌లో వికెట్ తీసిన పాండ్యా
-
Feb 23, 2025 17:12 IST
మూడో వికెట్ డౌన్
పాకిస్తాన్ స్కోర్ 34 ఓవర్లకు 154
మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
151 పరుగుల వద్ద మూడో వికెట్
46 పరుగులు చేసి పెవిలియన్ చేరిన రిజ్వాన్
భారీ భాగస్వామ్యం దిశగా వెళ్తున్న రిజ్వాన్, షకీల్ జోడిని విడగొట్టిన అక్షర్ పటేల్
34వ ఓవర్ రెండో బంతికి వికెట్ తీసుకున్న అక్షర్ పటేల్
-
Feb 23, 2025 16:49 IST
30 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్
పాకిస్తాన్ స్కోర్ 129/2
నిలకడగా ఆడుతున్న షకీల్, రిజ్వాన్
భారత్ బౌలర్లను ఇబ్బంది పెడుతున్న షకీల్, రిజ్వాన్
మంచి భాగస్వామ్యం నెలకొల్పిన షకీల్, రిజ్వాన్
పాక్ స్కోర్ అంచనా 272
ఆఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న సౌద్ షకీల్
ఆఫ్ సెంచరీకి చేరువలో మరో బ్యాటర్ రిజ్వాన్
బలపడుతున్న ఇద్దరి భాగస్వామ్యం
ప్రస్తుతం పాక్ స్కోర్ 32 ఓవర్లకు 142/2
-
Feb 23, 2025 16:29 IST
పాక్ స్కోర్
25 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 99/2
నిలకడగా ఆడుతున్న షకీల్, రిజ్వాన్
25వ ఓవర్లో ఐదు పరుగులు చేసిన పాకిస్తాన్
బ్యాటింగ్ చేస్తున్న షకీల్, రిజ్వాన్
స్కోర్ అంచనా 256
-
Feb 23, 2025 16:17 IST
పాక్ స్కోర్
21 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 82/2
21వ ఓవర్లో మూడు పరుగులు మాత్రమే
బ్యాటింగ్ చేస్తున్న షకీల్, రిజ్వాన్
స్కోర్ అంచనా 256
-
Feb 23, 2025 16:11 IST
పాక్ స్కోర్
20 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 79/2
20వ ఓవర్లో రెండు పరుగులు మాత్రమే
బ్యాటింగ్ చేస్తున్న షకీల్, రిజ్వాన్
స్కోర్ అంచనా 257
-
Feb 23, 2025 16:03 IST
పాక్ స్కోర్
18 ఓవర్లు పూర్తయ్యేసరికి పాక్ స్కోర్ 74/2
18వ ఓవర్లో రెండు పరుగులు మాత్రమే
బ్యాటింగ్ చేస్తున్న షకీల్, రిజ్వాన్
స్కోర్ అంచనా 258
-
Feb 23, 2025 15:58 IST
పాక్ స్కోర్
17 ఓవర్లు పూర్తయ్యేసరికి పాక్ స్కోర్ 72/2
17వ ఓవర్లో రెండు పరుగులు మాత్రమే
బ్యాటింగ్ చేస్తున్న షకీల్, రిజ్వాన్
స్కోర్ అంచనా 260
-
Feb 23, 2025 15:55 IST
పాక్ స్కోర్
15 ఓవర్లు పూర్తయ్యేసరికి పాక్ స్కోర్ 70/2
16వ ఓవర్లో 7 పరుగులు
బ్యాటింగ్ చేస్తున్న షకీల్, రిజ్వాన్
స్కోర్ అంచనా 258
-
Feb 23, 2025 15:43 IST
పాకిస్తాన్ స్కోర్
14 ఓవర్లకు పాకిస్తాన్ స్కోర్ 61/2
పాక్ స్కోర్ మార్కెట్ అంచనా 255
14వ ఓవర్లో రెండు పరుగులిచ్చిన షమీ
-
Feb 23, 2025 15:39 IST
పాకిస్తాన్ స్కోర్
13 ఓవర్లకు పాకిస్తాన్ స్కోర్ 59/2
పాక్ స్కోర్ మార్కెట్ అంచనా 256
-
Feb 23, 2025 15:36 IST
రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్
కష్టాల్లో పాకిస్తాన్
మొదటి పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయిన పాక్
12 ఓవర్లకు పాక్ స్కోర్ 58/2
బాబర్ అజామ్, ఇమామ్ అవుట్
చెరో వికెట్ తీసుకున్న పాండ్యా, కుల్దీప్
9.2 ఓవర్ల వద్ద రెండో వికెట్
10 పరుగుల వద్ద ఇమామ్ అవుట్
-
Feb 23, 2025 15:15 IST
పాకిస్తాన్ ఫస్ట్ విడెట్ డౌన్
మొదటి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
41 పరుగుల వద్ద బాబర్ అజామ్ ఔట్
9వ ఓవర్‌లో వికెట్ తీసుకున్న హర్థిక్ పాండ్యా
ఫస్ట్ పవర్ ప్లేలో వికెట్
-
Feb 23, 2025 15:06 IST
7 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ స్కోర్ అంచనా ఇదే..
7 ఓవర్లకు పాకిస్తాన్ స్కోర్ 31/0
7 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ ఇన్నింగ్స్ స్కోర్ 270 దాటొచ్చని బెట్టింగ్ మార్కెట్ అంచనా
ప్రతి ఓవర్‌కు మారనున్న అంచనా
తన మొదటి ఓవర్‌లో ఐదు పరుగులిచ్చిన హర్థిక్ పాండ్యా
-
Feb 23, 2025 14:06 IST
Ind vs Pak Match: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
కాసేపట్లో భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్
-
Feb 23, 2025 13:47 IST
పక్కా ప్లాన్‌తో రోహిత్, విరాట్.. పాక్‌కు ఇక చుక్కలే..
2021 నాటి వరల్డ్ కప్ టీ20 టోర్నీలో భారత్ ప్లేయర్లను పాక్ పేసర్ షాహీన్ అఫ్రీదీ చుక్కలు చూపించాడు. అతడిని మరోసారి ఎదుర్కోనున్న విరాట్, రోహిత్ తమదైన వ్యూహాలతో సిద్ధంగా ఉన్నారు.
-
Feb 23, 2025 13:35 IST
Ind vs Pak: ఇదీ చరిత్ర చెబుతున్న రికార్డ్..
Ind vs Pak Match: పాకిస్తాన్‌తో ఆడిన 13 ఐసీసీ వన్డే మ్యాచ్‌లలో భారత్ 10 మ్యాచ్‌లలో విజయం సాధించింది. అయితే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే మాత్రం సీన్ రివర్స్‌గా ఉంది. భారత్‌పై పాక్ ఆధిపత్యమే ఎక్కువగా ఉంది. పాక్ టీమ్ 3 మ్యాచ్‌ల్లో గెలవగా.. టీమ్ ఇండియా 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. భారత్‌పై పాక్‌కు పాజిటివ్ రికార్డ్ ఉన్న ఏకైక ఐసీసీ టోర్నమెంట్.. ఛాంపియన్ షిప్ టోర్నమెంట్.
-
Feb 23, 2025 13:32 IST
దుబాయ్‌లో ఇదీ పరిస్థితి..
Ind vs Pak Match: ఆదివారం దుబాయ్‌లో భారత్ - పాక్ మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో అక్కడి వాతావరణ పరిస్థితిపై ఉత్కంఠ నెలకొంది. తాజా వాతావరణ సమాచారం ప్రకారం.. దుబాయ్‌లో వాతావరణం సాధారణంగానే ఉంటుంది. కొంచెం ఎండగానే ఉంటుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. క్రికెట్‌కు అనువుగా ఉంటుందని చెబుతున్నారు. సాయంత్రం సమయంలో మంచు కురిసే అవకాశం లేనందున.. క్రికెట్ మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం ఏర్పడబోదు.
-
Feb 23, 2025 13:22 IST
అదే జరిగితే కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్..
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన క్రికెట్ కెరీర్‌లో మరో రికార్డ్ నెలకొల్పేందుకు సిద్ధమయ్యాడు. 14,000 వన్డే పరుగులు చేసిన మూడవ వ్యక్తిగా విరాట్ నిలవనున్నాడు. ఈ ఫీట్ సాధించడానికి కేవలం 15 పరుగుల గ్యాప్ మాత్రమే ఉంది. పాక్‌తో జరిగే మ్యాచ్‌లో 15 పరుగులు చేస్తే.. సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర సరసన చేరిపోతాడు కోహ్లీ.
-
Feb 23, 2025 13:10 IST
Ind vs Pak Match Live Score: రెండు జట్ల ఫామ్ పరిస్థితి ఇదీ..
Ind vs Pak Match Live Score: రెండు జట్ల ఇటీవలి ఫామ్‌ను పరిశీలిస్తే.. పాకిస్తాన్ చివరి ఐదు వన్డేల్లో మూడింటిలో ఓడిపోయింది. ఇక భారత్ చివరి నాలుగు టైలలో నాలుగు గెలిచింది.
-
Feb 23, 2025 13:07 IST
Ind vs Pak Match Live Score: రెండు జట్ల ఫామ్ పరిస్థితి ఇదీ..
Ind vs Pak Match Live Score: రెండు జట్ల ఇటీవలి ఫామ్‌ను పరిశీలిస్తే.. పాకిస్తాన్ చివరి ఐదు వన్డేల్లో మూడింటిలో ఓడిపోయింది. ఇక భారత్ చివరి నాలుగు టైలలో నాలుగు గెలిచింది.
-
Feb 23, 2025 13:07 IST
Ind vs Pak Match Live Score: ఫోకస్ అంతా గిల్ పైనే..
Ind vs Pak Match Live Score: పాక్‌తో మ్యాచ్ సందర్భంగా ఇప్పుడు అందరి దృష్టి శుభ్‌మన్ గిల్‌పై ఉంది. టీమ్ ఇండియా వైస్ కెప్టెన్‌గా కొత్త రోల్ పోషిస్తున్న గిల్.. గత నాలుగు ఇన్నింగ్స్‌లలో రెండు హాఫ్ సెంచరీలు, రెండు సంచరీలు చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ తన తఢాఖ చూపుతాడని క్రికెట్ అభిమానులు అంచనా వేసుకుంటున్నారు.
-
Feb 23, 2025 12:32 IST
Ind vs Pak Live Score: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి బుమ్రా దూరం..
Ind vs Pak Match Live Score: టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. వెన్ను గాయం కారణంగా.. ఈ పేసర్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు.
-
Feb 23, 2025 12:20 IST
భారత్-పాకిస్తాన్: వన్డేల్లో హెడ్-టు-హెడ్ రికార్డ్స్..
ఆడిన మ్యాచ్‌లు: 135
భారత్ గెలిచింది: 57
పాకిస్తాన్ విజయం: 73
చివరి ఐదు మ్యాచ్‌లు: భారత్ 5-0
-
Feb 23, 2025 12:16 IST
భారత్-పాక్ మ్యాచ్.. ఈ విషయాలు తెలుసా..
1. గత సంవత్సరం T20 ప్రపంచ కప్ తర్వాత భారతదేశం, పాకిస్తాన్ తమ మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాయి.
2. చివరి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో.. పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోయింది. 2017లో ఛాంపియన్‌గా నిలిచింది.
3. దుబాయ్‌లో 2021లో జరిగిన ఐసిసి టి20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు చివరిసారిగా తలపడినప్పుడు పాకిస్తాన్ భారత్‌ను ఓడించింది.
4. 2022 ఆసియా కప్ తర్వాత జరిగిన ప్రతి మ్యాచ్‌లోనూ భారత్.. పాకిస్తాన్‌ను చిత్తు చేస్తూ వచ్చింది. గత ఐదు హెడ్-టు-హెడ్ మ్యాచ్‌లలో భారత్.. పాకిస్తాన్‌పై 5-0 ఆధిక్యంలో ఉంది.
5. దుబాయ్‌లో ఆడిన చివరి ఏడు వన్డేల్లో భారత్ ఆరు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది.
-
Feb 23, 2025 10:59 IST
విజయం ఎవరిదో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం నాడు భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగనుంది. దాయాదుల మధ్య పోరులో ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠ క్రికెట్ ప్రేమికులను టెన్షన్ పెడుతోంది. ఇటు భారత్, అటు ఇండియా క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
-
Feb 23, 2025 10:02 IST
దుబాయ్ పిచ్ రిపోర్ట్.. భారత్-పాక్‌లో ఎవరికి అనుకూలం..
IND vs PAK: ఉద్విగ్న పోరుకు అంతా రెడీ అయింది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ బరిలోకి దిగడమే తరువాయి. వీళ్ల కొట్లాట చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. మరి.. ఆదివారం నాడు జరిగే బ్లాక్‌బస్టర్ ఫైట్ కోసం దుబాయ్ గ్రౌండ్‌ను ఎలా సిద్ధం చేస్తున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..
-
Feb 23, 2025 10:01 IST
భారత్‌తో మ్యాచ్.. స్పెషల్ కోచ్‌ను నియమించుకున్న పాకిస్తాన్ టీమ్..!
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ (Ind vs Pak) క్రికెట్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కీలక సమరానికి రంగం సిద్ధమవుతోంది. రసవత్తర మ్యాచ్ కోసం దాయాది దేశాలు సిద్ధమవుతున్నాయి. ఆదివారం దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. దీంతో భారత్‌తో ఆదివారం జరిగే మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది.
-
Feb 23, 2025 09:59 IST
భారత్ vs పాకిస్తాన్.. గత రికార్డులు, పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉండబోతోంది..!
ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కీలక సమరానికి రంగం సిద్ధమవుతోంది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ (Ind vs Pak) క్రికెట్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఆదివారం దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. దీంతో భారత్‌తో ఆదివారం జరిగే మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది.
-
Feb 23, 2025 09:55 IST
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు కీలక సమరం జరుగనుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ (Ind vs Pak) క్రికెట్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఆదివారం దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. దీంతో భారత్‌తో ఆదివారం జరిగే మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది.