Share News

IND vs NZ Match Live Updates: చివరి వరకు ఉత్కంఠ.. ఎట్టకేలకు గెలుపు.. ఛాంపియన్స్ ట్రోపీ గెలిచిన భారత్

ABN , First Publish Date - Mar 09 , 2025 | 11:56 AM

IND vs NZ Final Match: ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్స్ మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. 23.2 ఓవర్లకే కివీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. నాలుగు వికెట్లు స్పిన్నర్లకే పడ్డాయి. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసుకున్నారు. మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ ప్రతీ అప్‌డేట్.. ఆంధ్రజ్యోతి మీకోసం అందిస్తోంది.. అస్సలు మిస్ అవ్వకండి..

IND vs NZ Match Live Updates: చివరి వరకు ఉత్కంఠ.. ఎట్టకేలకు గెలుపు.. ఛాంపియన్స్ ట్రోపీ గెలిచిన భారత్
IND vs NZ Live score

Live News & Update

  • Mar 09, 2025 21:47 IST

    ఛాంపియన్స్ ట్రోపీ గెలిచిన భారత్

    • మూడోసారి ఛాంపియన్స్ ట్రోపీ గెలిచిన భారత్

    • 2002లొ ఛాంపియన్స్ ట్రోపీని సంయుక్తంగా గెలిచిన భారత్-శ్రీలంక

    • 2013లో రెండోసారి ఛాంపియన్స్ ట్రోపీ గెలిచిన టీమిండియా

    • 2025లో న్యూజిలాండ్‌పై గెలిచి ఛాంపియన్స్ ట్రోపీ కైవసం

    • చివరి వరకు ఉత్కంఠ

    • ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్

    • తొలుత బ్యాటింగ్ చేసి 251 పరుగులు చేసిన న్యూజిలాండ్

    • 252 పరుగుల లక్ష్యాన్ని చేధించిన భారత్

  • Mar 09, 2025 21:03 IST

    నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

    • నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

    • శ్రేయస్ అయ్యర్ అవుట్

    • 38.4 ఓవర్ల వద్ద అవుటైన అయ్యర్

    • హాఫ్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో అవుట్

  • Mar 09, 2025 20:37 IST

    విజయం కోసం శ్రమిస్తున్న భారత్

    • ఫస్ట్ పవర్ ప్లేతో పోలిస్తే తగ్గిన భారత్ రన్ రేట్

    • నిలకడగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్

    • 33 ఓవర్లకు భారత్ స్కోర్ 154/3

  • Mar 09, 2025 19:51 IST

    భారత్‌కు బిగ్ షాక్.. వరుసగా రెండు వికెట్లు

    • రెండో వికెట్ కోల్పోయిన భారత్

    • విరాట్ కోహ్లీ అవుట్

    • మొదటి వికెట్‌గా అవుటైన గిల్

    • రెండో వికెట్‌గా కోహ్లీ అవుట్

  • Mar 09, 2025 19:22 IST

    విజయానికి చేరువలో భారత్

    • అదరగొడుతున్న భారత్ బ్యాట్స్‌మెన్

    • 12 ఓవర్లకు 71/0

    • రోహిత్ శర్మ ఆఫ్ సెంచరీ

    • 41 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసిన రోహిత్

    • క్రీజులో రోహిత్, గిల్

  • Mar 09, 2025 18:35 IST

    ఫస్ట్‌ ఓవర్‌లోనే సిక్సర్‌తో చెలరేగిన హిట్‌మ్యాన్

    • భారత్ బ్యాటింగ్ ప్రారంభం

    • తొలి ఓవర్‌లో 9 పరుగులు

    • మొదటి ఓవర్ రెండో బంతికి రోహిత్ సిక్స్

  • Mar 09, 2025 18:03 IST

    భారత్ టార్గెట్ 252

    • ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 251 పరుగులు చేసిన న్యూజిలాండ్

    • నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు

    • ఆఫ్ సెంచరీలు చేసిన బ్రేస్‌వెల్, మిచెల్

    • రెండేసి వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి, కుల్దీప్

  • Mar 09, 2025 17:35 IST

    నిలకడగా ఆడుతున్న ఆ ఇద్దరు ఆటగాళ్లు

    • 200 పరుగులు దాటిన న్యూజిలాండ్ స్కోర్

    • 45 ఓవర్లకు 201 పరుగులు

    • క్రీజులో మిచెల్, బ్రేస్‌వెల్

    • నిలకడగా ఆడుతున్న మిచెల్, బ్రేస్‌వెల్

    • ఆఫ్ సెంచరీ చేసిన మిచెల్

    • కివీస్ స్కోర్ 250 దాటే ఛాన్స్

  • Mar 09, 2025 17:02 IST

    ఐదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

    • ఐదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

    • 37.5 ఓవర్ల వద్ద వికెట్

    • ఫిలిప్స్ 34 పరుగుల వద్ద అవుట్

    • ఫిలిప్స్‌ను పెవిలియన్ పంపిన వరుణ్ చక్రవర్తి

  • Mar 09, 2025 16:20 IST

    నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

    • 23.2 ఓవర్ల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

    • టామ్ టాథమ్ అవుట్

    • రవీంద్ర జడేజా బౌలింగ్‌లో పెవిలియన్ చేరిన టామ్ లాథమ్

  • Mar 09, 2025 15:26 IST

    రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

    • రచిన్ రవీంద్ర అవుట్

    • 11వ ఓవర్ తొలిబంతికి రవీంద్ర క్లీన్ బౌల్డ్

    • కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరిన రవీంద్ర

  • Mar 09, 2025 15:13 IST

    ఫస్ట్ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

    • 57 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

    • 8.5 ఓవర్ల వద్ద యంగ్ అవుట్

  • Mar 09, 2025 14:58 IST

    ఆరు ఓవర్లకే భారీ స్కోర్

    • ఆరు ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 46/0

    • క్రీజులో యంగ్, రచిన్ రవీంద్ర

    • చెలరేగి ఆడుతున్న రచిన్ రవీంద్ర

  • Mar 09, 2025 14:08 IST

    టాస్ ఓడిన టీమిండియా.. కివీస్ బ్యాటింగ్..

    ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా వరుసగా 15 టాసులు ఓడిపోయింది. ఇందులో రోహిత్ కెప్టెన్సీలో 12 టాస్‌లు ఓడిపోయింది.

  • Mar 09, 2025 14:03 IST

    Ind vs Nz Final Match: పిచ్ ఎలా ఉందో చూశారా..

    Champion Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కానుంది. మ్యాచ్ కోసం పిచ్‌ను సిద్ధం చేశారు. పిచ్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Mar 09, 2025 13:13 IST

    India vs New Zealand Final : ఇండియా ఎన్ని టైటిల్స్ గెలిచిందో తెలుసా..

    India vs New Zealand Final Match: భారత్ ఇప్పటి వరకు ఆరు ఐసీసీ ట్రోఫీలను గెలచుకుంది. వీటిలో రెండు వన్డే వరల్డ్ కప్ ట్రోఫీలు(1983, 2011), రెండు టీ20 కప్‌లు(2007, 2024), రెండు చాంపియన్‌ ట్రోఫీలు(2002, 2013) గెలుచుకుంది. ఈసారి కప్పు గెలవాల్సిందేనని టీమిండియా పట్టుదలతో ఉంది.

  • Mar 09, 2025 13:06 IST

    ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ

    • హైఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దం..

    • ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్.

    • దుబాయ్ వేదికగా మధ్యహ్నం 2:30గంటలకు ఫైనల్.

    • తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే దుబాయ్ చేరుకున్న క్రికెట్ ఫ్రాన్స్.

    • దుబాయ్ వెళ్ళిన పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు.

    • మరోవైపు హైదరాబాద్ లో పీవీఆర్ సినిమాస్‌లో మ్యాచ్ కోసం ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు.

    • ఆదివారం సెలవు కావడంతో బార్లు, పబులు, రెస్టారెంట్లలో మినీ స్క్రీన్స్.

  • Mar 09, 2025 12:52 IST

    Ind vs Nz Final Match: రోహిత్ శర్మ టాస్ రికార్డ్..

    వన్డే క్రికెట్‌లో టీమ్ ఇండియా వరుసగా 14 టాస్‌లు ఓడిపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా 11 టాస్‌లు ఓడిపోయింది. బ్రియాన్ లారా 12 టాస్‌ల ఓటమి రికార్డ్‌కు రోహిత్ ఒక టాస్ దూరంలో ఉన్నాడు. టాస్ అనేది ఆటను ప్రభావితం చేయలేదు కానీ.. కొన్నిసార్లు పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది.

  • Mar 09, 2025 12:39 IST

    Ind vs Nz Match: టీమిండియా జట్టు ఇదేనా..

    రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.

  • Mar 09, 2025 11:56 IST

    IND vs NZ Final Match Live Updates in Telugu: ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఆఖరి అంకానికి చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌ - భారత జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీమిండియాకిది వరుసగా మూడో ఛాంపియన్స్ ట్రోఫీ కాగా.. ఇప్పటి వరకు రెండుసార్లు టైటిల్ కైవసం చేసుకుంది. 2013లో భారత్‌ చివరిసారి గెలిచింది. తాజా టోర్నీలో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాపై గెలిచి రోహిత్‌ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు కివీస్‌ కూడా గ్రూప్‌ దశలో భారత్‌ చేతిలో మాత్రమే ఓడింది. ఆ ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని కివీస్ సేన సిద్ధంగా ఉంది. ఇకపోతే.. 2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది కివీస్. ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లోనూ భారత్‌పై కివిస్ పైచేయి సాధించింది. దీంతో ఈ రెండు జట్ల మధ్య టఫ్ ఫైట్ ఉండనున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ ఫైనల్ పోరులో గెలిచేదెవరు.. ఓడేదెవరు.. మ్యాచ్‌కు సంబంధించి ప్రతీ అప్‌డేట్ మీకోసం..