Share News

India vs Australia T20 Series: పొట్టి సిరీస్‌ లక్ష్యంగా

ABN , Publish Date - Oct 29 , 2025 | 06:31 AM

మూడు వన్డేల సిరీ్‌సను 1-2తో కోల్పోయిన టీమిండియా ఇక ధనాధన్‌ పోరుపై దృష్టి పెట్టింది. తాజా టీ20 జట్టులోకి యువ ఆటగాళ్ల చేరికతో పాటు ఆల్‌రౌండర్ల అండతో సూర్యకుమార్‌ సేనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది...

India vs Australia T20 Series: పొట్టి సిరీస్‌ లక్ష్యంగా

  • బరిలోకి టీమిండియా

  • కెప్టెన్‌ సూర్య ఫామ్‌పై ఆందోళన

  • పేసర్‌ బుమ్రా రాక

  • ఆస్ట్రేలియాతో తొలి టీ20

కాన్‌బెర్రా: మూడు వన్డేల సిరీ్‌సను 1-2తో కోల్పోయిన టీమిండియా ఇక ధనాధన్‌ పోరుపై దృష్టి పెట్టింది. తాజా టీ20 జట్టులోకి యువ ఆటగాళ్ల చేరికతో పాటు ఆల్‌రౌండర్ల అండతో సూర్యకుమార్‌ సేనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. దీనికి తోడు ఇటీవలే ఆసియాకప్‌ గెలిచిన జోష్‌లో ఉన్న వరల్డ్‌ నెంబర్‌వన్‌ టీమిండియా.. బుధవారం నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టీ20ల సిరీ్‌సను శుభారంభం చేయాలనుకుంటోంది. అటు ఇరు జట్లు కూడా తమ ప్రత్యర్థులపై ఆడిన చివరి 10 టీ20ల్లో ఎనిమిది గెలిచి, ఒక ఓటమితో సమవుజ్జీగా ఉన్నాయి. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌క్‌పనకు ముందు భారత్‌ 15 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందుకే ఈ సిరీ్‌సను చక్కటి సన్నాహకంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. మరోవైపు ఇప్పటికే వన్డే సిరీస్‌ను గెలిచిన ఆసీస్‌ ఈ ధనాధన్‌ పోరులోనూ తమదే పైచేయి కావాలనుకుంటోంది.

సూర్య పుంజుకునేనా?: భారత జట్టులోని ఇతర బ్యాటర్లతో పోలిస్తే కెప్టెన్‌ సూర్య పేలవ ఫామ్‌పై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆందోళనగా ఉంది. తన కెప్టెన్సీలో ఆడిన 29 మ్యాచ్‌ల్లో భారత్‌ 23 గెలిచినప్పటికీ బ్యాటర్‌గా మాత్రం అతడు విఫలమవుతున్నాడు. ఈ ఏడాది ఆడిన 10 ఇన్నింగ్స్‌లో సూర్య కేవలం 100 రన్స్‌ మాత్రమే చేయగలిగాడు. గిల్‌తో కెప్టెన్సీ విషయంలో పోటీ ఉండడంతో ఈ సిరీస్‌ ద్వారా బ్యాట్‌ ఝుళిపించి విమర్శకులకు సమాధానమివ్వాల్సిన అవసరం ఉంది. ఆసియాక్‌పలో అదరగొట్టిన ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఎప్పటిలాగే మెరుపు ఇన్నింగ్స్‌తో శుభారంభం అందించాలనుకుంటున్నాడు. మరో ఓపెనర్‌ గిల్‌ వన్డే సిరీ్‌సలో విఫలమై ఒత్తిడిలో ఉన్నాడు. సూర్య, తిలక్‌, శాంసన్‌లతో మిడిలార్డర్‌ బలంగా కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకుంటున్న నితీశ్‌కుమార్‌ ఈ మ్యాచ్‌లో ఆడేది సందేహమే. అలాగే బుమ్రా రాకతో బౌలింగ్‌ విభాగం పటిష్టంగా మారింది. పేస్‌లో అర్ష్‌దీప్‌ అతడికి జత కానున్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఆలోచన ఉంటే కుల్దీప్‌, వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌పటేల్‌ ఆడేది ఖాయమే.


మ.1.45 గం. నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

పటిష్టంగా ఆసీస్‌: గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ ఓటమి తర్వాత ఆసీస్‌ టీ20 జట్టు అత్యంత పటిష్టంగా రూపొందింది. మిచెల్‌ మార్ష్‌ నేతృత్వంలో ఆడిన చివరి 20 మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే ఓడడం వీరి దూకుడైన ఆటతీరుకు నిదర్శనం. ఓపెనర్లు హెడ్‌, మార్ష్‌ ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడుతూ ఒత్తిడి తేగలరు. ఇక తాజాగా జట్టులోకి ఇన్‌గ్లి్‌స, స్టొయినిస్‌, డేవిడ్‌, మ్యాక్స్‌వెల్‌లాంటి హిట్టర్లు చేరడం భారత్‌కు సవాల్‌గా మారనుంది. తొలి రెండుమ్యాచ్‌లు మాత్రమే ఆడే పేసర్‌ హాజెల్‌వుడ్‌ ఈసారి కూడా భారత్‌ను ఇబ్బందిపెట్టాలనుకుంటున్నాడు.

పిచ్‌, వాతావరణం

ఇక్కడి మనూకా ఓవల్‌ మైదానంలో బౌండరీ విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో స్వల్ప స్కోర్లే నమోదవుతుంటాయి. వికెట్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉండనుంది. ఇక చల్లటి వాతావరణం ఉండి రోజులో చిరు జల్లులకు ఆస్కారం ఉన్నప్పటికీ మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం ఉండదు.

తుది జట్లు (అంచనా)

భారత్‌: అభిషేక్‌, గిల్‌, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), తిలక్‌, శాంసన్‌, రింకూ సింగ్‌, అక్షర్‌, దూబే/హర్షిత్‌, కుల్దీ్‌ప/వరుణ్‌, అర్ష్‌దీప్‌, బుమ్రా.

ఆస్ట్రేలియా: మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), హెడ్‌, ఇన్‌గ్లి్‌స, డేవిడ్‌, ఫిలిప్‌, ఓవెన్‌, స్టొయినిస్‌, ఎబాట్‌/బార్ట్‌లెట్‌, ఎలిస్‌, కునేమన్‌, హాజెల్‌వుడ్‌.

ఈ వార్తలు కూడా చదవండి...

మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు

ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు

Cyclone Montha: పునరావాస శిబిరాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Cyclone Montha: మొంథా తుపాను నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 06:31 AM