Share News

India vs West Indies 2025: వెస్టిండీస్‌పై చారిత్రాత్మక విజయం.. ప్రపంచ రికార్డు సమం..

ABN , Publish Date - Oct 14 , 2025 | 04:42 PM

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. రెండు టెస్ట్‌ల్లోనూ విండీస్ జట్టును చిత్తు చేసింది. ఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ రికార్డును సమం చేసింది.

India vs West Indies 2025: వెస్టిండీస్‌పై చారిత్రాత్మక విజయం.. ప్రపంచ రికార్డు సమం..
India home win record

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. రెండు టెస్ట్‌ల్లోనూ విండీస్ జట్టును చిత్తు చేసింది. ఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ రికార్డును సమం చేసింది. ఒక ప్రత్యర్థి జట్టుపై వరుసగా పది టెస్ట్ సిరీస్ విజయాలను సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డును సమం చేసింది (India cricket history).


వెస్టిండీస్‌పై భారత్ సాధించిన 10వ టెస్ట్ సిరీస్ విజయం ఇది. దీంతో ఒక ప్రత్యర్థిపై అత్యధిక సిరీస్ విజయాలు సాధించిన ప్రపంచ రికార్డును టీమిండియా సమం చేసింది. ఇప్పటివరకు ఆ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉంది. విండీస్‌పై భారత్ విజయ పరంపర 2002లో ప్రారంభమైంది. అప్పట్నుంచి ఇప్పటివరకు విండీస్‌తో ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా టీమిండియా కోల్పోలేదు. తాజా విజయంతో విండీస్‌పై వరుసగా 10 సిరీస్ విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా రికార్డును టీమిండియా సమం చేసింది. 1998- 2024 మధ్య విండీస్‌పై దక్షిణాఫ్రికా వరుసగా 10 సిరీస్ విజయాలు సాధించింది (India surpasses South Africa).


ప్రత్యర్థిపై వరుసగా అత్యధిక టెస్ట్ సిరీస్ విజయాలు:

  • ఇండియా vs వెస్టిండీస్ (2002-25) * - 10

  • దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ (1998-24) - 10

  • ఆస్ట్రేలియా vs వెస్టిండీస్ (2000-22) - 9

  • ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ (1989-2003) - 8

  • శ్రీలంక vs జింబాబ్వే (1996-20) - 8


స్వదేశంలో అత్యంత విజయవంతమైన మూడో జట్టు:

టెస్ట్ క్రికెట్‌లో స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన మూడో జట్టుగా కూడా భారత్ అవతరించింది (India home win record). టీమిండియా ఇప్పటివరకు స్వదేశంలో 296 మ్యాచ్‌లు ఆడి 122 విజయాలు సాధించింది. భారత్ కంటే ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఉన్నాయి.

స్వదేశంలో అత్యధిక టెస్టు విజయాలు:

  1. ఆస్ట్రేలియా: 450 మ్యాచ్‌ల్లో 262 విజయాలు

  2. ఇంగ్లాండ్: 558 మ్యాచ్‌ల్లో 241 విజయాలు

  3. భారతదేశం: 296 మ్యాచ్‌ల్లో 122 విజయాలు

  4. దక్షిణాఫ్రికా: 254 మ్యాచ్‌ల్లో 121 విజయాలు

  5. వెస్టిండీస్: 270 మ్యాచ్‌ల్లో 95 విజయాలు


ఇవి కూడా చదవండి

Shubman Gill: కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్

Vaibhav Suryavanshi: వైభవ్‌ మరో చరిత్ర

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 14 , 2025 | 04:42 PM