Share News

Ind vs SA 3rd ODI: విశాఖకు పోటెత్తిన జనం

ABN , Publish Date - Dec 06 , 2025 | 01:16 PM

విశాఖపట్నం వేదికగా ఇవాళ(శనివారం) భారత్, సౌతాఫ్రికా మధ్య వేదికగా మూడో వన్డే జరగనుంది. 20 వన్డేల తర్వాత తొలిసారి భారత్ టాస్ గెలిచింది. టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.

Ind vs SA 3rd ODI: విశాఖకు పోటెత్తిన జనం

ఇంటర్నెట్ డెస్క్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మధ్య చివరి వన్డే విశాఖపట్నం వేదికగా జరగనుంది. మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 1-1తో రెండు జట్లు సమనంగా ఉంటడంతో చివరి వన్డే అయిన విశాఖ మ్యాచ్ పై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. విశాఖ పట్నం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులు భారీగా స్టేడియానికి తరలి వచ్చారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది. 2023 వరల్డ్ కప్ సెమీఫైనల్ నుంచి నేటి వరకు 20 వన్డే టాస్ లను భారత్ ఓడింది.


  • ఈ మ్యాచ్‌కు ముందు వరుసగా 20 సార్లు టాస్‌ ఓడిపోయిన భారత్

  • రెండేళ్ల 21 రోజుల తర్వాత టాస్‌ గెలిచిన టీమిండియా

  • చెత్త రికార్డ్‌కు బ్రేక్ చేసిన కేఎల్‌ రాహుల్‌


మ్యాచ్‌కు భారీ భద్రత:

ఇక భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం జరుగుతున్న వన్డే క్రికెట్ మ్యాచ్ కు సుమారు రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్‌తో పిచ్, ఔట్ ఫీల్డుతో పాటు గ్యాలరీలు, పరిసరాలు శుక్రవారం తనిఖీ చేశారు. అన్ని గేట్ల వద్ద క్యూలో ప్రేక్షకులను లోపలికి పంపిస్తున్నారు. మ్యాచ్ సుమారు రాత్రి 11 గంటల సమయంలో ముగుస్తుందని వేల సంఖ్య లో వాహనాలు జాతీయ రహదారిపైకి రాకుండా చోదకులు సంయమనం పాటించి కొద్ది నిమిషాల వ్యవధిలో వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తవన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Seema Punia: సీమా పునియాకు భారీ షాక్.. 16 నెలల నిషేధం

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. షఫాలీ వర్మ నామినేట్

Updated Date - Dec 06 , 2025 | 01:46 PM