Share News

Sultan Johor Cup 2025: కుర్రాళ్ల జోరు న్యూజిలాండ్‌పై భారత్‌ గెలుపు

ABN , Publish Date - Oct 13 , 2025 | 06:32 AM

సుల్తాన్‌ జొహోర్‌ కప్‌ జూనియర్‌ హాకీ టోర్నీలో భారత జట్టు జోరు కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 4-2తో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది...

Sultan Johor Cup 2025: కుర్రాళ్ల జోరు న్యూజిలాండ్‌పై భారత్‌ గెలుపు

జొహోర్‌ కప్‌

జూనియర్‌ హాకీ

జొహోర్‌ బహ్రూ (మలేసియా): సుల్తాన్‌ జొహోర్‌ కప్‌ జూనియర్‌ హాకీ టోర్నీలో భారత జట్టు జోరు కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 4-2తో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. అర్ష్‌దీప్‌ (2ని.), సునీల్‌ (15ని.), అరిజీత్‌ సింగ్‌ హుండాల్‌ (26ని.), రోషన్‌ (47ని.) భారత్‌కు గోల్స్‌ అందించారు. గస్‌ నెల్సన్‌ (41ని.), ఐడన్‌ మ్యాక్స్‌ (52ని.) న్యూజిలాండ్‌ తరపున గోల్స్‌ చేశారు. టోర్నమెంట్‌లో భారత్‌కిది రెండో విజయం. శనివారంనాటి ఆరంభ మ్యాచ్‌లో గ్రేట్‌ బ్రిటన్‌పై 3-2తో నెగ్గిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్‌ తలపడుతుంది.

ఇవి కూడా చదవండి..

కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!

మచాడో మాదిరే రాహుల్‌ పోరాటం

For More National News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 06:32 AM