India Faces Defeat in Second ODI: అడిలైడ్‌లోనూ అదే తీరు
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:35 AM
అత్యంత పటిష్టమైన జట్టుతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియాకు మరో పరాభవం. ఒత్తిడిని అధిగమిస్తూ వెటరన్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (73) బ్యాటింగ్‌లో చెలరేగినా.. బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా...
రెండో వన్డేలో టీమిండియా ఓటమి
ఆసీ్‌సదే సిరీస్
రోహిత్, శ్రేయాస్ పోరాటం వృథా
స్పిన్నర్ జంపాకు నాలుగు వికెట్లు
17 ఏళ్లుగా అడిలైడ్‌లో భారత జట్టుకు ఓటమి లేదు.. పైగా ఇక్కడ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన అనుభవం.. అంతేకాకుండా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అచ్చొచ్చిన మైదానం. ఇన్ని అనుకూలతల మధ్య రెండో వన్డే బరిలోకి దిగిన టీమిండియా కచ్చితంగా నెగ్గి సిరీ్‌సలో నిలుస్తుందనుకున్న ఆశలు అడియాశలే అయ్యాయి. రోహిత్ ఆకట్టుకున్నా, విరాట్ రెండోసారీ డకౌట్ కాగా.. అటు వరుసగా రెండు విజయాలతో ఆతిథ్య ఆసీస్ జట్టు సిరీస్ కూడా దక్కించుకుంది.
అడిలైడ్: అత్యంత పటిష్టమైన జట్టుతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియాకు మరో పరాభవం. ఒత్తిడిని అధిగమిస్తూ వెటరన్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (73) బ్యాటింగ్‌లో చెలరేగినా.. బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా గురువారం జరిగిన రెండో వన్డేలో ఆసీస్ రెండు వికెట్ల తేడాతో నెగ్గింది. అలాగే మూడు వన్డేల ఈ సిరీ్‌సను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో దక్కించుకుంది. నామమాత్రపు ఆఖరి వన్డే శనివారం సిడ్నీలో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (61), అక్షర్ పటేల్ (44), హర్షిత్ (24 నాటౌట్) రాణించారు. స్పిన్నర్ ఆడమ్ జంపాకు నాలుగు, పేసర్లు బార్ట్‌లెట్‌కు మూ డు, స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఆసీస్ 46.2 ఓవర్లలో 265/8 స్కోరుతో గెలిచింది. షార్ట్ (74), కూపర్ (61 నాటౌట్) అదరగొట్టారు. సుందర్, అర్ష్‌దీప్, హర్షిత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఆడమ్ జంపా నిలిచాడు.
కూపర్ అజేయంగా..: ఈ పిచ్‌పై 265 పరుగుల ఛేదన కష్టమే అనిపించినా వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్, మిడిలార్డర్‌లో 22 ఏళ్ల కూపర్ కనోలీ, ఓవెన్ సులువు చేశారు. భారత బౌలర్లు చివర్లో వికెట్లు తీసి ఉత్కంఠ నెలకొల్పినా.. ఛేదనకు పుష్కలంగా బంతులు మిగిలి ఉండడంతో ఆసీ్‌సకు ఇబ్బంది ఎదురుకాలేదు. ఓపెనర్లు హెడ్ (28), మార్ష్ (11) విఫలమయ్యారు. అయితే షార్ట్ మాత్రం రెన్షా (30)తో మూడో వికెట్‌కు 55, కూపర్‌తో ఐదో వికెట్‌కు 55 రన్స్ జోడించి 36వ ఓవర్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కూపర్ బాధ్యత తీసుకుని హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. ఓవెన్ సహకారంతో ఆరో వికెట్‌కు 59 పరుగులు జోడించాడు. చివర్లో విజయానికి 34 బంతుల్లో 10 రన్స్ కావాల్సిన వేళ 2 వికెట్లు కోల్పోయినప్పటికీ.. కూపర్ మరో 22 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.
ఆదుకున్న రోహిత్-శ్రేయా్‌స: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ స్కోరు 250 దాటగలిగిందంటే రోహిత్ శర్మ పోరాటమే కారణం. అతడికి శ్రేయాస్ సహకరించడంతో మూడో వికెట్‌కు 118 పరుగులు సమకూరాయి. అయితే ఆరంభంలో రోహిత్ తీవ్రంగా తడబడ్డాడు. తానెదుర్కొన్న తొలి 32 బంతుల్లో కేవ లం 8 పరుగులే చేయడంతో పాటు మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అటు పేసర్ బార్ట్‌లెట్ ఏడో ఓవర్‌లో కెప్టెన్ గిల్ (8), విరాట్ (0)ల వికెట్లు తీయడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈ దశలో రోహిత్‌కు శ్రేయాస్ జత కట్టాడు. ఆ తర్వాత రోహిత్ 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, శ్రేయాస్ ఫోర్‌తో 17 రన్స్ రాబట్టారు. ఇదే క్రమంలో ఇద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే వీరు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరగా, అటు స్పిన్నర్ జంపా, హాజెల్‌వుడ్ మధ్య ఓవర్లలో రన్స్‌ను కట్టడి చేశారు. అక్షర్ బౌండరీలతో ఆకట్టుకున్నా మరో ఎండ్ నుంచి సహకారం అందలేదు. ఒకే ఓవర్‌లో అక్షర్, నితీశ్ (8)లను జంపా పెవిలియన్‌కు చేర్చడంతో భారీ స్కోరుపై ప్రభావం పడింది. కానీ తొమ్మిదో వికెట్‌కు హర్షిత్-అర్ష్‌దీప్ (13) జోడీ 37 పరుగులు జత చేయడంతో సవాల్ విసిరే స్కోరందుకుంది.
స్కోరుబోర్డు
భారత్: రోహిత్ (సి) హాజెల్‌వుడ్ (బి) స్టార్క్ 73, గిల్ (సి) మార్ష్ (బి) బార్ట్‌లెట్ 9, విరాట్ (ఎల్బీ) బార్ట్‌లెట్ 0, శ్రేయాస్ (బి) జంపా 61, అక్షర్ (సి) స్టార్క్ (బి) జంపా 44, రాహుల్ (బి) జంపా 11, సుందర్ (సి) హాజెల్‌వుడ్ (బి)బార్ట్‌లెట్ 12, నితీశ్ (స్టంప్) క్యారీ (బి) జంపా 8, హర్షిత్ (నాటౌట్) 24, అర్ష్‌దీప్ (బి) స్టార్క్ 13, సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 50 ఓవర్లలో 264/9. వికెట్ల పతనం: 1-17, 2-17, 3-135, 4-160, 5-174, 6-213, 7-223, 8-226, 9-263; బౌలింగ్: స్టార్క్ 10-0-62-2, హాజెల్‌వుడ్ 10-2-29-0, బార్ట్‌లెట్ 10-1-39-3, ఓవెన్ 2-0-20-0, జంపా 10-0-60-4, కూపర్ 3-0-11-0, షార్ట్ 3-0-23-0, హెడ్ 2-0-16-0.
ఆస్ర్టేలియా: మార్ష్ (సి) రాహుల్ (బి) అర్ష్‌దీప్ 11, హెడ్ (సి) విరాట్ (బి) హర్షిత్ 28, షార్ట్ (సి) సిరాజ్ (బి) హర్షిత్ 74, రెన్షా (బి) అక్షర్ 30, క్యారీ (బి) సుందర్ 9, కూపర్ (నాటౌట్) 61, ఓవెన్ (సి) అర్ష్‌దీప్ (బి) సుందర్ 36, బార్ట్‌లెట్ (సి) గిల్ (బి) అర్ష్‌దీప్ 3, స్టార్క్ (సి) అక్షర్ (బి) సిరాజ్ 4, జంపా (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 46.2 ఓవర్లలో 265/8. వికెట్ల పతనం: 1-30, 2-54, 3-109, 4-132, 5-187, 6-246, 7-255, 8-260; బౌలింగ్: సిరాజ్ 10-0-49-1, అర్ష్‌దీప్ 8.2-0-41-2, హర్షిత్ 8-0-59-2, సుందర్ 7-0-37-2, నితీశ్ 3-0-24-0, అక్షర్ 10-0-52-1.
1
విరాట్ కోహ్లీ వన్డే కెరీర్‌లో వరుసగా రెండు సార్లు డకౌట్ కావడం ఇదే తొలిసారి.
2008 తర్వాత అడిలైడ్ మైదానంలో భారత్ వన్డేల్లో ఓడడం ఇదే తొలిసారి.
ఈ వార్తలు కూడా చదవండి..
అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదు.. వైసీపీపై రఘరామ సెటైర్లు
Virat Kohli Emotional: అడిలైడ్ మ్యాచ్‌లో భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ
Read Latest AP News And Telugu News