IND VS SA T20: భారత్‌కు షాక్.. స్వల్ప పరుగులకే మూడు వికెట్లు
ABN , Publish Date - Dec 09 , 2025 | 07:46 PM
కటక్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. పరుగులు రాబట్టేందుకు భారత్ బ్యాటర్లు కష్టపడుతున్నారు. స్వల్ప స్కోర్కే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది.
కటక్, డిసెంబర్ 09: ఐదు టీ20 సిరీస్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ(మంగళవారం) తొలి మ్యాచ్ జరుగుతుంది. కటక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ గిల్(4) పరుగులకే ఔటయ్యాడు. భారత్ 5 పరుగుల వద్ద తొలి వికెట్ గిల్ రూపంలో కోల్పోయింది. శుభ్ మన్ గిల్.. లొంగి ఎంగిడి బౌలింగ్ లో మార్కో యాన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా కేవలం 12 పరుగులు చేసి.. ఔటయ్యాడు. రెండో వికెట్ కూడా ఎంగిడినే తీశాడు. ఎంగిడి వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో వరుసగా 4, 6 బాదిన సూర్య.. తర్వాతి బంతికే మార్‌క్రమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 17 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. దూకుడు మీద ఆడుతున్న మరో ఓపెనర్ అభిషేక్ శర్మ సైతం పెవిలియన్ చేరాడు. అభిషేక్ శర్మ రూపంలో 48 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ(23), అక్షర్ పటేల్(10)ఉన్నారు. తిలక్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. పది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 71/3.
ఇవీ చదవండి:
Hardik Pandya: ఫొటో గ్రాఫర్లపై హార్దిక్ పాండ్య అసహనం.. ఎందుకంటే.?