Asian Shooting Championships: ఒక్కరోజే 4 స్వర్ణాలు
ABN , Publish Date - Aug 22 , 2025 | 02:16 AM
ఆసియా చాంపియన్‌షి్‌ప్సలో భారత షూటర్లు గురువారంనాటి పోటీలలో ఐదు స్వర్ణాలకు గాను 4 పసిడి పతకాలు కొల్లగొట్టారు. దాంతో మొత్తం 26 పతకాలతో (14-6-6) పట్టికలో భారత్ టాప్‌లో ఉంది. మహిళల జూ. స్కీట్ విభాగంలో...
ఆసియా షూటింగ్ చాంపియన్‌షి్‌ప్స
షిమ్‌కెంట్ (కజకిస్థాన్): ఆసియా చాంపియన్‌షి్‌ప్సలో భారత షూటర్లు గురువారంనాటి పోటీలలో ఐదు స్వర్ణాలకు గాను 4 పసిడి పతకాలు కొల్లగొట్టారు. దాంతో మొత్తం 26 పతకాలతో (14-6-6) పట్టికలో భారత్ టాప్‌లో ఉంది. మహిళల జూ. స్కీట్ విభాగంలో మాన్సీ రఘువంశీ స్వర్ణం నెగ్గగా, యశస్వీ రాథోడ్ కాంస్యం గెలుపొందింది. పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ పసిడి పతకం దక్కించుకుంది. జూ. పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో అభినవ్ షా స్వర్ణంతో మెరిశాడు. జూ.పురుషుల 10 మీ.ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో వరల్డ్, ఆసియా రికార్డు స్కోరుతో పసిడి చేజిక్కించుకుంది. జూ.పురుషుల స్కీట్ టీమ్ విభాగంలోనూ భారత్ స్వర్ణం అందుకుంది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి