Share News

Ind Vs SA: సునాయాస విజయం.. సిరీస్ టీమిండియాదే!

ABN , Publish Date - Dec 06 , 2025 | 08:51 PM

వైజాగ్ 3వ వన్డేలో భారత్ 271 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి సునాయసంగా ఛేదించింది. యశస్వి జైస్వాల్ అజేయ 116, విరాట్ కోహ్లీ 65*, రోహిత్ 75 పరుగులతో రాణించారు. భారత్ 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను దక్కించుకుంది.

Ind Vs SA: సునాయాస విజయం.. సిరీస్ టీమిండియాదే!
Ind Vs SA

ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో వైజాగ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా సునాయాసంగా గెలుపొందింది. 271 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్.. కేవలం ఒక వికెట్ కోల్పోయి 39.5 ఓవర్లలోనే ఆటను ముగించింది. యశస్వి జైస్వాల్(116) అజేయ సెంచరీతో చెలరేగాడు. వన్డేల్లో యశస్వికి ఇది తొలి శతకం కావడం విశేషం. 75 బంతుల్లో అర్ధ శతకం చేసిన జైస్వాల్.. మరో 36 బంతుల్లోనే మూడంకెల స్కోరును అందుకున్నాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(75) తొలి వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(65) ఆది నుంచి దూకుడుగా ఆడుతూ నాటౌట్‌గా నిలిచాడు. ఈ మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.


తొలుత టాస్‌లో గెలుపొందినప్పుడే జట్టుకి విజయం ఖాయం అన్నట్టుగా అభిమానులు భావించారు. బ్యాటింగ్‌కి దిగిన సౌతాఫ్రికా.. ఆరంభంలో వికెట్ కోల్పోయింది. డికాక్(106), టెంబా బవుమా(48) మినహా మిగతా బ్యాటర్లంతా టీమిండియా బౌలర్ల ధాటికి కుప్పకూలారు. 47.5 ఓవర్లకే 270 పరుగులు చేసి సౌతాఫ్రికా ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ చెరో నాలుగు వికెట్లు తీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ 271

రికార్డు సృష్టించిన క్వింటన్ డికాక్

Updated Date - Dec 06 , 2025 | 09:23 PM