Share News

Hardik PandyaWith Mahieka: దీపావళి వేళ మోడల్‌ మహికాతో హార్దిక్ పాండ్య షికారు

ABN , Publish Date - Oct 21 , 2025 | 06:20 PM

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య నటి మహికా శర్మతో ప్రేమలో ఉన్నట్టు పుకార్లు షికారు చేశాయి. గతంలో ముంబై ఎయిర్ పోర్టులో వీరిద్దరూ కనిపించారు. తాజాగా దీపావళి వేళ ఓ కార్యక్రమానికి హాజరవుతూ మరోసారి మీడియా కంటబడ్డారు.

Hardik PandyaWith Mahieka: దీపావళి వేళ మోడల్‌ మహికాతో హార్దిక్ పాండ్య షికారు
Hardik PandyaWith Mahieka

క్రికెట్ న్యూస్: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కొందరు మోడల్స్ తో డేటింగ్ లో ఉన్నట్లు తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. కొంతకాలం నుంచి మోడల్, నటి మహికా శర్మతో ప్రేమలో ఉన్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో మహికా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో హార్ధిక్ తో ఉన్న ఫొటోస్ పోస్ట్ చేసింది. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఆ తర్వాత ముంబై ఎయిర్ పోర్టులోనూ వీరిద్దరు కనిపించారు. తాజాగా దీపావళి వేళ ఓ కార్యక్రమానికి హాజరవుతూ వీరిద్దరు మరోసారి మీడియా కంటబడ్డారు.


దీపావళి పండగ వేళ హార్ధిక్ పాండ్య(Hardik Pandya), మహికా శర్మ.. ఇద్దరూ ఎరుపు రంగు దుస్తులలో సందడి చేశారు . హార్దిక్ ఎరుపు కుర్తా ధరించగా, మహికా ఎరుపు బంధానీ సల్వార్ సూట్‌లో ఉంది. ముంబైలో జరిగిన దీపావళి డిన్నర్ పార్టీకి వీరిద్దరు హాజరైనట్లు సమాచారం. దీనికి సంంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ వచ్చిన రూమర్స్ కు తాజాగా వీడియో మరింత బలం చేకూర్చింది. గతంలో ముంబయి ఎయిర్‌పోర్ట్‌ వద్ద హార్దిక్, మహికా శర్మ(Mahika Sharma) కెమెరాలకు చిక్కారు.


నటాషాతో విడాకులు తీసుకున్నాక హార్దిక్‌ (Hardik Pandya) తన ‘రూమర్డ్‌’ గర్ల్‌ఫ్రెండ్‌ మహికా శర్మతో కనిపించడం ఇది రెండో సారి. ఆసియా కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ సందర్భంగా దుబాయ్ లో కూడా మహికా కనిపించింది. 2020లో నటాషా స్టాంకోవిచ్ ను హార్దిక్ వివాహం చేసుకున్నాడు. అయితే వ్యక్తిగత కారణాలతో 2024 నటాషా నుంచి విడిపోతున్నట్లు హార్ధిక్ ప్రకటించాడు. విడాకుల అనంతరం మోడల్ జాస్మిన్ వాలియాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జోరుగా సాగింది. అయితే.. ఈ పుకార్లపై ఇద్దరూ స్పందించలేదు. ఈ గుసగుసలు సద్దుమణగక ముందే, పాండ్యా మహికా శర్మతో మోడల్‌తో డేటింగ్‌లో ఉన్నాడన్న మరో రూమర్ జోరందుకుంది.


మహికా శర్మ( Mahika Sharma) విషయానికి వస్తే.. కొన్ని సినిమాల్లో సహాయ పాత్రలలో నటించింది. వీటిలో వివేక్ ఒబెరాయ్‌తో కలిసి నటించిన ‘ఇన్ టు ది డస్క్’, ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమాలు ఉన్నాయి. మహికా తనిష్క్, వివో, యునిక్లో వంటి ప్రధాన బ్రాండ్ల ప్రకటనలు సైతం చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీరిద్దరి వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'ఇంక ఆలస్యం ఎందుకు హార్ధిక్.. మహికా(Mahika Sharma)ను పెళ్లి చేసుకోవచ్చు కదా' అంటూ సలహాలు సైతం ఇస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ప్లేయర్లు, సెలక్టర్ల మధ్య క్లారిటీ ఉండాలి.. షమీ వివాదంపై ఆర్ అశ్విన్ కామెంట్

గిల్ కెప్టెన్సీ బాలేదు..టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 21 , 2025 | 06:44 PM